ఏపీలో ఎన్నికలు వాయిదా పడతాయా ? పడాల్సిన అవసరం ఉందా ?

ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికలు మరికొంతకాలం వాయిదాపడే అవకాశం ఉందని, దీనికి కారణం పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడమే కారణం అని ప్రచారం జరుగుతోంది.

 Is Andhra Pradesh Elections Going To Postpone-TeluguStop.com

ఒక వైపు ప్రజల వ్యక్తిగత వివరాలు గల్లంతు అయ్యాయని ప్రచారం జరుగుతుండగానే మరోవైపు లక్షల్లో ఓట్ల గల్లంతు అయ్యాయనే ఆరోపణలు తీవ్రం అయ్యాయి.ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఓటు కూడా గల్లంతు అయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అంతే కాకుండా వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు కూడా తొలిగించినట్టు వార్తలు వినిపిస్తుండడంతో ఓటర్ల జాబితాపై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి.

ఈ తప్పుల జాబితాతోనే ఎన్నికలకు వెళ్తే ఎన్నికల కమిషన్ భారీగా అప్రదిష్ట మూటగట్టుకోవాల్సిందే.ఒక వైపున చూస్తే ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది.మరోవైపు చుస్తే సుమారు 55 లక్షల మంది ఓట్లు గల్లంతు అయ్యాయనే వాదన వైసీపీ వినిపిస్తూ టీడీపీ మీది విమర్శలు చేస్తోంది.

తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేశారని వైసీపీ, కాదు కాదు తమ పార్టీ ఓట్లే తొలిగించారని టీడీపీ వాదిస్తోంది.కానీ ఏ పార్టీకి చెందని వారి ఓట్లు కూడా భారీగా గల్లంతు అయ్యాయనేది నిజం.

ఇంత పెద్ద ఎత్తిన ఓట్లు తొలిగించడంపై పెద్ద రచ్చ నడుస్తుండగా ఎన్నికలు సజావుగా ఎలా జరిపిస్తారని మేధావులు కొంతమంది ఎన్నికల కమిషన్ ను ప్రస్తస్తున్నారు.

ఈ విధంగానే మొన్న తెలంగాణ లో కూడా లక్షల్లో ఓట్లు గల్లంతు అయ్యాయని అనేక కుమ్ములాటలు జరిగాయి.కానీ అప్పటికే ఎన్నికల తంతు మొదలవ్వడంతో ఏమీ చేయలేక ఆ తంతు కాస్తా పూర్తిచేసేసారు.ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి ఉండడంతో ముందుగా ఎన్నికల వేళ లక్షల్లో ఓట్లు పోయాయి.

చివరి నిముషంలో తెలుసుకుని ఏం చేయలేకపోయారు.ఇపుడు ఏపీ వంతు వచ్చింది.

మరి దాన్ని సరిచేసేందుకు సమయం ఉందా అన్నదే ఇక్కడ ప్రశ్న.ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత అధికారులు ఆ హడావుడిలో ఉంటారు.

అందుకే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.ఓటర్ల జాబితా అంతా సరిచేసి అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని, అప్పటివరకు గవర్నర్ కు పరిపాలన బాధ్యత అప్పగించాలనే వాదన మొదలయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube