గర్వించదగ్గ విషయం... ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం మనదే

ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్లోబల్‌ వార్మింగ్‌పై దృష్టి పెట్టింది.భూమిని ఇలాగే కాలుష్యం చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తు తరాల వారు తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయం అంటూ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు.

 Cleanest Village In Asia Is Meghalayas Mawlynnong In India Asia-TeluguStop.com

భూమి మీద చెట్ల శాతం చాలా తగ్గుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు.అందుకే స్వచ్చ భారత్‌, పచ్చని భారత్‌ అంటూ రకరకాల పథకాలు ప్రభుత్వాల ద్వారా తీసుకు రావడం జరుగుతుంది.

కేవలం ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు అన్ని కూడా పచ్చదనంను మర్చి పోతున్న నేపథ్యంలో మనదేశంలోని ఒక గ్రామంలో మాత్రం పచ్చదనం విరసిల్లుతుంది.అందుకే ఆ గ్రామం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గ్రేట్‌ అనిపించుకుంటుంది.

ఆసియా ఖండంలోనే అత్యంత సుందరమైన, శుభ్రమైన, పచ్చదనం కలిగిన గ్రామంగా మేఘాలయ రాష్ట్రంలోని మౌలినాంగ్‌ అనే చిన్న గ్రామానికి పేరు దక్కింది.ఆసియాలోనే అద్బుతమైన గ్రామంగా పేరు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.అద్బుతమైన ఆ గ్రామంలోని పచ్చదనం ఆ పేరును తీసుకు వచ్చింది.

కేవలం 400 మంది మాత్రమే ఉండే ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా చెత్త కనిపించదు.ఒక్కసారి కాకుంటే ఒక్కసారైనా చెత్త అనేది అక్కడ ఉండనే ఉండదు.గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెత్త శ్రామికుల మాదిరిగా పని చేస్తారు.

అంటే చెట్లకు సంబంధించిన లేదా మరి దేనికి సంబంధించిన చెత్త పడిపోయి ఉన్నా కూడా వెంటనే పక్కనే ఉన్న వెదురు బుట్టల్లో వాటిని వేసేస్తారు.

ఇది నాఇల్లు కాదు, నా ఇంటి వద్ద క్లీన్‌గా ఉంటే చాలు అనుకునే పరిస్థితి అక్కడ ఉండదు.ఆ ఊరు అంతా మన ఇల్లు అన్నట్లుగా వారంతా కూడా భావిస్తారు.చాలా శుభ్రమైన పరిసరాలను కలిగి ఉన్న ఆ గ్రామ ప్రజలు చాలా తక్కువగా జబ్బు పడతారు.

స్వచ్చమైన గాలి మరియు నీరు వారికి అందుతున్నాయి.దేశంలోని ప్రతి గ్రామం, ప్రపంచంలోని ప్రతి ప్రాంతం ఇలా అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ ఉండదు, ఇంకే పర్యవరణ సమస్య ఉండదు.

వారికి సాద్యం అయ్యింది, ఇక్కడ మనకు ఎందుకు సాధ్యం అవ్వడం లేదో నాయకులు మరియు ప్రజలు ఒకసారి ఆలోచించాలి.

ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులతో షేర్‌ చేసుకోండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube