నాని ప్రస్తుతం చేస్తున్న ‘జెర్సీ’ చిత్రం విడుదలైన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే.గ్యాంగ్ లీడర్ అంటూ ఇప్పటికే ఫస్ట్‌లుక్ టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.
నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో టైటిల్ వివాదం మొదలు అయ్యింది.చిరంజీవి సూపర్ హిట్ మూవీ అయిన గ్యాంగ్ లీడర్ టైటిల్ వ్యాలిడిటీ పూర్తి అయ్యింది.
దాంతో దాన్ని మళ్లీ ఎవరైనా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు.అయితే నాని అండ్ టీం ఈ చిత్రం టైటిల్ రిజిస్ట్రర్ చేయాలని భావించిన సమయంలో అప్పటికే ఆ టైటిల్ మరెవ్వరికో ఉందని తేలింది.
నాని బర్త్‌డే హడావుడిలో ఆ విషయాన్ని వదిలేసి నేరుగా గ్యాంగ్ లీడర్ అంటూ తాము సినిమా టైటిల్ పెట్టాము అంటూ విక్రమ్ టీం ప్రకటించింది.అయితే ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం ఒకరు రిజిస్ట్రర్ చేసిన టైటిల్‌ను వేరే వారు తమ సినిమాకు ఉపయోగించుకోవద్దు.
ఒక వేళ ఆ టైటిల్‌ను బదిలీ చేయించుకుంటే పర్వాలేదు కాని, బదిలీ చేసుకోకుండా సినిమాను టైటిల్‌తో ప్రకటించడం రూల్స్‌ను బ్రేక్ చేయడం అవుతుంది.గ్యాంగ్ లీడర్ టైటిల్‌ను కొన్ని నెలల క్రితం రిజిస్ట్రర్ చేయించిన మోహన కృష్ణ ఇప్పుడు నాని టీంపై విరుచుకు పడుతున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు నాని సినిమాపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు.మూడు కోట్ల బడ్జెట్‌తో నేను సినిమా ప్లాన్ చేశాను, ఆ సినిమాను ఏప్రిల్‌లో పట్టాలెక్కించబోతున్నాను.నటీనటుల ఎంపిక జరుగుతుందని మోహనకృష్ణ చెబుతున్నాడు.తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాంగ్ లీడర్ ఇవ్వను అంటూ తేల్చి చెబుతున్నాడు.ఇలాంటి సమయంలో నాని అండ్ టీం చర్చలు జరపకుండా ముందే టైటిల్‌ను ప్రకటించి తప్పు చేశాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి నాని మూవీ టైటిల్ గ్యాంగ్ లీడర్ అయ్యి ఉండదు అంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఈ వివాదం నుండి తప్పించుకునేందుకు టైటిల్‌ను మార్చాల్సి రావచ్చు అంటున్నారు.ఆరంభంకు ముందే ఈ ఇలాంటి చెడు శకునం ఎదురు కావడంతో నాని అండ్ టీం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.