ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసిన షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సాహో.ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని వున్నాయి.

 Shades Of Saaho Chapter 2 Records Highest Viewership-TeluguStop.com

బాహుబలి తర్వాత తెరక్కుతున్న సినిమా కావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని వుంది.హాలీవుడ్ స్టాండర్డ్స్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సాహో నుంచి చాప్టర్ 1 పేరుతో మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించింది.

ఇదిలా వుంటే తాజాగా సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన సాహో చాప్టర్ 2 మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ వీడియో రిలీజ్ అయిన ఒక్క రోజులో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ని సొంతం చేసుకొని విశేషంగా ఆకట్టుకుంది.యాక్షన్ ఎలిమెంట్స్ తో రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియో ఒక్క రోజులో ఏకంగా 79 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని మేకింగ్ వీడియోలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ వీడియోతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.మరి ఈ హైప్ ని ప్రభాస్ సాహో తో ఎ మేరకు అందుకుంటాడు అనేది చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube