ప్రత్యేక హోదాపై కేంద్రానికి హై కోర్ట్ మొట్టికాయలు! మూడు వారాల్లో సమాధానం చెప్పండి!

ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాపై గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత వాటికి మంగళం పాడేసి, ఏపీకి తీరని అన్యాయం చేసింది.అయిన నాలుగేళ్ళు బీజేపీని సమర్ధిస్తూ వచ్చిన చంద్రబాబు, ఎన్నికలకి ఏడాది ముందు యూటర్న్ తీసుకొని కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.

 High Court Questioning To Bjp Government-TeluguStop.com

అయితే అప్పటికే భాగా ఆలస్యం అయిపోయింది అని చెప్పాలి.ఇదిలా వుంటే ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్ట్ లో ప్రజాప్రయోజన పిటీషన్ దాఖలైంది.

ఈ ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వ్వడం లేదో స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని నిలదీసింది.విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇవ్వలేకపోతుంది తెలియజేస్తూ మూడు వారాలలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ కేంద్రాన్ని ఆదేశించింది.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో దీనిపై బీజేపీ సర్కార్ వివరణ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube