వైసీపీ జాబితా రెడీ ! ఇక విడుదలే తరువాయి

మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో వైసీపీ ముందస్తుగా రకరకాల వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.దీనిలో భాగంగానే ముందస్తుగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రకటించాలని చూస్తున్నాడు.

 Ys Jagan To Release Ycp Mp Mla Candidates List-TeluguStop.com

అభ్యర్థుల ప్రకటన ఆలస్యం చేసేకొద్ది నష్టమే తప్ప లాభం ఉండదు అనే ఆలోచనకు జగన్ వచ్చేసాడు.మరో వైపు చూస్తే టీడీపీ దూకుడుగా ముందుకు వెళ్తోంది.

పార్టీ అభ్యర్థుల ఎంపికలో గతానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు.సుమారు 100 స్థానాల్లో అభ్యర్థులను ఆయన నోటిఫికేషన్ వచ్చే నాటికే ప్రకటించాలని చూస్తున్నారు.అందుకే టీడీపీతో పాటు పోటీగా అభ్యర్థుల ప్రకటన చేసే ఆలోచనలో జగన్ కనిపిస్తున్నాడు.

ముందుగా పార్లమెంట్ అభ్యర్థుల మీద దృష్టిపెట్టాడు.

వారి పేర్లు ప్రకటించకపోయినా టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉన్నవారిని పిలిచి ప్రచారం మొదలుపెట్టేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నాడు.ఆ విధంగానే అధినేత నుంచి మాట పొందిన టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగితేలుస్తున్నారు.

అభ్యర్థుల ప్రకటన విషయంలో వైసీపీ కంటే టీడీపీనే దూకుడు ప్రదర్శిస్తోంది.ఇప్పటికే జగన్ 100-120 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ కి వచ్చాడట.ముఖ్యంగా… సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇవ్వాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు.23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీలోనే కొనసాగిన ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని, నోటిఫికేషన్ వచ్చాక చేరితే టిక్కెట్లు ఇవ్వలేమని వైసీపీ నేతలు ఆశావాహులు సంకేతాలు పంపిస్తున్నారు.ఇప్పటికీ బలమైన అభ్యర్థులు లేని నియోజకవర్గాలకు మాత్రం రెండో విడతలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.మొత్తంగా చూస్తే కొద్దీ రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండబోతున్నట్టు గా వైసీపీ వైకిరి ఉంది.అది కాస్తా పూర్తయితే ఇక నిత్యం ప్రజల్లో ఉండేలా జగన్ ప్లాన్ వేసుకుంటున్నాడు.

అందుకే బస్సుయాత్ర ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.ఇప్పటికే ఆయన బస్సు యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా నేతలు సిద్ధం చేశారు.

పాదయాత్రలో మిగిలి ఉన్న నియోజకవర్గాలను బస్సు యాత్ర ద్వారా కవర్ చేసి ఆ తరువాత మరోసారి ఏపీ అంతా సుడిగాలి పర్యటనలు చేసే ఆలోచనలో జగన్ ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube