ఇది మరీ ఓవర్‌ అమ్మడు

సెలబ్రెటీలు ఏదేని బ్రాండ్స్‌ కు పబ్లిసిటీ చేసినప్పుడు ఆ బ్రాండ్స్‌ గురించి తెగ ఎత్తేస్తూ ఉంటారు.అంత గొప్ప, ఇంత గొప్ప, నేను వాడుతున్నా, నాకు నచ్చింది అంటూ తెగ చెప్తారు.

 Trolls On Tamanna About United Colors Of Benetton Summer Collections-TeluguStop.com

ఏదైనా ఓపెనింగ్స్‌ సమయంలో కూడా ఆ మాల్స్‌ ను సెలబ్రెటీలు పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు.ఇలాంటివి అన్ని కూడా చాలా కామన్‌ గా మనం చూస్తూ ఉంటాం.

అయితే తాజాగా యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ సమ్మర్‌ కలెక్షన్స్‌ ను సిటీలో ఆరంభించిన తమన్నా కాస్త ఓవర్‌ గా రియాక్ట్‌ అయ్యింది.

యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ సమ్మర్‌ కలెక్షన్స్‌ ఓపెనింగ్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడిన తమన్నా… నా వద్ద యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ బ్రాండ్‌ కు చెందిన ఒక పాయింట్‌ ఉంది.అది నాకు చాలా చాలా ఇష్టం.అది తీసుకుని చాలా కాలం అయ్యింది.

అయినా కూడా నేను వేసుకుంటూనే ఉన్నాను.అది చిరిగినా కూడా కుట్టించి కూడా వేసుకుంటున్నాను.

చిరుగుతూనే ఉన్నా కుట్టించుకుని మరీ వేసుకుంటున్నాను అంటే నాకు యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనెటన్‌ అంటే ఎంత ఇష్టమో మీరే అర్థం చేసుకోవచ్చు అంది.చిరిగిన పాయింట్‌ ను మళ్లీ మళ్లీ కుట్టించుకుని వేసుకుంటున్నాను అంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో కామెడీ ట్రోల్స్‌ నడుస్తున్నాయి.

తమన్నా మరీ ఓవర్‌ చేసింది, ఒక బ్రాండ్‌ గురించి పబ్లిసిటీ చేసే సమయంలో ఆ బ్రాండ్‌ తనకు ఇష్టం అంటూ చెప్పడం పర్వాలేదు, కాని ఆ బ్రాండ్‌ పాయింట్‌ చినిగినా దాన్ని మళ్లీ మళ్లీ కుట్టించుకుని మరీ వేసుకుంటున్నాను అని చెప్పడం ఏంటీ అంటూ తమన్నాపై కామెంట్స్‌ చేస్తున్నారు.తమన్నా మీడియా దృష్టి ఆకర్షించేందుకు మరియు ఆ బ్రాండ్‌ వారి మెప్పు పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిందనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube