రూ. 100 లంచం కేసు 32 ఏళ్లు పట్టింది... ఇది మన దేశంలో కోర్టుల తీరు

మనది ప్రజాస్వామ్య దేశం, మన రాజ్యాంగం మరియు న్యాయవ్యవస్థ చాలా బాగుంటుంది.కాని న్యాయవ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి.

 Bombay High Court Acquits Dead Doctor In 32 Year Old Rs 100 Bribe Case-TeluguStop.com

ప్రపంచంలోనే అత్యున్నన న్యాయవ్యవస్థ ఉన్న మన దేశంలో కేసులు సంవత్సరాల తరబడి నాన్చుతూ వస్తుంటారు.కారణాలు ఏంటో కాని చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంవత్సరాలకు సంవత్సరాలు నాన్చుతూనే ఉంటారు.

లోతుగా విచారణ జరపాలి, ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశ్యంతో ఎక్కువ కాలం విచారణ జరుపుతూ ఉండవచ్చు.అయితే అలా చేయడం వల్ల కొన్ని సార్లు నష్టం జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలి.

తాజాగా ముంబయి హైకోర్టు ఒక కేసు విషయంలో తీర్పు ఇచ్చింది.లంచం తీసుకున్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషి అంటూ కోర్టులో తీర్పు వచ్చింది.

అయితే తాను నిర్ధోషిగా బయట పడ్డందుకు సంతోషించేందుకు ఆ వ్యక్తి బతికి లేడు.ఆ వ్యక్తి చనిపోయి దాదాపు అయిదు సంవత్సరాలు అవుతుంది.చనిపోయిన వ్యక్తి నిర్దోషిగా కోర్టు పేర్కొని క్లీన్‌ చీట్‌ ఇవ్వడం జరిగింది.ఇంతకు ఆ వ్యక్తిపై ఎంత లంచం తీసుకున్నాడని కేసు నమోదు అయ్యిందో తెలుసా.

అక్షరాల వంద రూపాయలు.అవును వంద రూపాయల లంచం తీసుకున్నాడంటూ 32 సంవత్సరాల క్రితం ముంబయికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది.

ఆ కేసు వాదనలు పూర్తి అయ్యి తీర్పు వచ్చేప్పటికి 32 ఏళ్లు పట్టింది.ఈ కేసును దాదాపు 10 మంది జడ్జ్‌లు విచారించారని, ఎంతో మంది న్యాయవాదులు ఈ కేసు గురించి వాదించారని అంటున్నారు.ఒక చిన్న కేసు గురించి ప్రభుత్వంకు చెందిన జడ్జ్‌ల సమయం, న్యాయవాదుల సమయం వృదా అయ్యింది.కేసు చిన్నదే అయినా కూడా ఇన్నేళ్లు సాగతీయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే కేసు విచారణ అప్పుడే వేగంగా ముగించి ఉంటే ఆ వ్యక్తి దోషిగా శిక్షింపబడేవాడు అనేది కొందరి వాదన.

సుదీర్ఘ వివరణల తర్వాత అతడు దోషి కాదని తేలిపోయింది.నిర్దోషిగా వెళ్లడయ్యింది.32 సంవత్సరాల తర్వాత అతడు నిర్ధోషిగా వెళ్లడయ్యింది.మరి ఇంత కాలం అతడు పడ్డ క్షోభకు సమాధానం ఎవరు చెప్పాలి అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ పరిస్థితికి కారణం సరిపోను జడ్జ్‌లు లేకపోవడంతో పాటు, న్యాయవ్యవస్థలోని చిన్న చిన్న లోపాలు అంటూ నిపుణులు అంటున్నారు.

వీటిని మనం ఏమీ చేయలేం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube