మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రకటన! ఎలక్షన్ కమిషన్ నిర్ణయం!

అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది.ఇక అన్ని పార్టీలు ఎన్నికలలో ప్రజలని ఆకర్షించడం కోసం తమ రాజకీయ వ్యూహాలకి పదును పెట్టాయి.

 Election Commission Of India Announces Schedule-TeluguStop.com

ఇక ఏపీలో అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ వ్యూహాలలో భాగంగా ఒకరి మీద ఒకరు మాటలతో దాడులు చేసుకుంటున్నారు.మరో వైపు ఏపీలో జనసేన పార్టీ కూడా ప్రజలలో సైలెంట్ వేవ్ ని క్రియేట్ చేసే పనిలో వుంది.

ఇదిలా వుంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అనే విషయంపై ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఆసక్తి నెలకొని వుంది.

ఇక దేశ వ్యాప్తంగా ఎన్నికల శంఖారావం మోగనుంది దీనికి ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇక ఈ నెల 8 లేదా 11వ తేదీలలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా వున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేయడంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియని మొదలెట్టినట్లు తెలుస్తుంది.

నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా తొమ్మిది విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube