నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫ్లాప్ అనే విషయాలను పక్కన పెట్టి వరుసగా చిత్రాలను చేస్తూనే ఉన్నాడు.తాజాగా 118 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీగా అంచనాలు లేకుండానే విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడంలో కూడా విఫలం అయ్యింది.దాంతో కలెక్షన్స్ రావడం అనుమానమే అని అంతా అనుకున్నారు.
మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే నిరాశజనకంగా ఉన్నాయన్నారు.అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 8 కోట్లకు ఈ సినిమా అమ్ముడు పోయింది.
అయితే ఆ మొత్తం వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి.
మొదటి నాలుగు రోజుల్లో దాదాపుగా 5.8 కోట్ల రూపాయలను ఈ చిత్రం రాబట్టింది.మరో రెండు కోట్ల రూపాయలు మాత్రమే బ్యాలన్స్ ఉంది.
సోమవారం శివరాత్రి సెలవు అవ్వడంతో 118 చిత్రంకు కలిసి వచ్చింది.శని, ఆది, సోమ వారాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్‌కు చేరువ అయ్యింది.
వారం రోజుల్లో కాకున్నా లాంగ్ రన్లో అయినా 8 కోట్లను ఈ చిత్రం దాటుతుందనే టాక్ వినిపిస్తుంది.
మొదటి నాలుగు రోజుల్లో ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు :
నైజామ్ – 2.44 కోట్లు సీడెడ్ – 0.85 కోట్లు ఉత్తరాంధ్ర – 0.61 కోట్లు గుంటూరు – 0.44 కోట్లు ఈస్ట్ – 0.30 కోట్లు వెస్ట్ – 0.24 కోట్లు కృష్ణా – 0.43 కోట్లు నెల్లూరు – 0.13 కోట్లు
మొత్తం – 5.44 కోట్లు
.