కౌశల్‌ తీసుకున్న సంచలన నిర్ణయంతో అభిమానుల్లో గందరగోళం... నిజంగానే తప్పు చేశాడా?

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ తన అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తన అభిమాన సంఘం కౌశల్‌ ఆర్మీని కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌గా మార్చాడు.రంగారెడ్డి జిల్లాలో కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ను రిజిస్ట్రర్‌ కూడా చేయించాడు.

 Koush Wants To Cancel Kousha Army Foundation-TeluguStop.com

కౌశల్‌పై ఉన్న అభిమానంతో చాలా మంది ఈ ఫౌండేషన్‌కు దానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.అలా ఫౌండేషన్‌కు భారీగానే డబ్బు వచ్చి చేరింది.

ఈ సమయంలోనే కౌశల్‌ ఆర్మీకి చెందిన కొందరు కీలక మెంబర్స్‌ మీడియా ముందుకు వచ్చి కౌశల్‌ తప్పులు చేస్తున్నాడు, ఆయన ఫౌండేషన్‌ డబ్బులను దుబార చేస్తున్నాడు అంటూ విమర్శలు చేయడం జరిగింది.

కౌశల్‌ తనపై వస్తున్న విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలం అయ్యాడు.వారిపై ఆరోపణలు చేసేందుకు పరిమితం అయ్యాడు కాని, ఆయనపై పడ్డ మచ్చను చెరిపేసుకోలేక పోయాడు.ఇలాంటి సమయంలో కౌశల్‌ పై మరింతగా వారు రెచ్చి పోయారు.

కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ అనేది మొత్తం ఒక ఫ్రాడ్‌ అంటూ వారు చెబుతున్న నేపథ్యంలో కౌశల్‌ ఫౌండేషన్‌ను క్యాన్సిల్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.తెలుగు రాష్ట్రాల్లో మరియు జాతీయ స్థాయిలో ఉన్న కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ సభ్యులను, కార్యవర్గంను క్యాన్సిల్‌ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

త్వరలోనే మళ్లీ మంచి వ్యక్తులను, వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వారిని కార్యవర్గ సభ్యులుగా చేర్చుతాను అంటూ ప్రకటించాడు.అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇప్పటికే కౌశల్‌పై అనుమానాలు మొదలు అయ్యాయి.ఇలాంటి సమయంలో కౌశల్‌ ఫౌండేషన్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన నిజంగానే తప్పు చేశాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొత్తానికి తనకు వచ్చిన అద్బుతమైన ప్రేక్షకాధరణను కౌశల్‌ సద్వినియోగం చేసుకోకుండా ఆర్థికపరమైన లాభాలకు వాడుకునేందుకు చూశాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు.మరి అసలు నిజం ఏది అనేది కాలమే నిర్ణయించాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube