పోలీసులపైకి మలం బాంబులు వేస్తున్న నిరసన కారులు.. ముక్కుమూసుకుని పారిపోతున్న పోలీసులు

ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఏదో ఒక సందర్బంలో, ఏదో ఒక కారణం వల్ల నిరసనలు వెళ్లువెత్తుతూనే ఉంటాయి.అయితే కారణం ఏంటీ అనేది పక్కన పెడితే ఎప్పటికప్పుడు నిరసనకారులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వాలు పోలీస్‌ ఫోర్స్‌ను ఉపయోగించడం, వారు నిరసనకారులను చితకొట్టడం జరుగుతుంది.

 French Police Hit With Poo Bombs At Yellow Vest Protests-TeluguStop.com

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి.పెంచిన ట్యాక్స్‌లను వెంటనే తగ్గించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.

ఈ సమయంలో పోలీసులు వారిని అదుపు చేసేందుకు బలం ప్రయోగిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ నెంబర్‌ మరింత ఎక్కువగా ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.పోలీసులు అత్యంత రాక్షసంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో నిరసన కారులు మరో అడుగు ముందుకు వేశారు.

పోలీసులను అడ్డుకునేందుకు, తమ వైపు రాకుండా ఉండేందుకు వింత బాంబులను తయారు చేశారు.మలంతో పాటు, స్వల్పంగా పేళే మందుగుండు సామాగ్రితో బాంబులను తయారు చేయడం జరిగింది.

ఆ బాంబులు ఫ్రాన్స్‌ పోలీసులను ఇబ్బంది పెడుతున్నాయి.

మొదట ఒక్కచోట ప్రారంభం అయిన ఈ మలం బాంబులు ఇప్పుడు ఫ్రాన్స్‌లో పలు ప్రాంతాల్లో వేస్తున్నారు.పోలీసులను చిరాకు పెడుతు, పరిగెత్తేలా చేస్తున్న ఈబాంబులను పెంటికలు, మలంలను ఉపయోగించి చేస్తున్నారు.సంచుల నిండుగా, బస్తాల నిండుగా వాటిని తీసుకు వచ్చి పోలీసులపై పోయడంతో పోలీసులు చిరాకుగా అక్కడ నుండి పారిపోతున్నట్లుగా స్థానికులు అంటున్నారు.

పోలీసులను భయపెట్టేందుకు, వారి నుండి బయట పడేందుకు తమకు ఇంతకు మించిన మంచి మార్గం లభించలేదని, ఫ్రాన్స్‌ ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని నిరసన కారులు అంటున్నారు.ముందు ముందు పోలీసుల పట్ల మరింత కఠినంగా కూడా వ్యవహరిస్తామని నిరసన కారులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube