సర్జికల్ స్ట్రైక్ లో చావుల కంటే మాకు టార్గెట్ ముఖ్యం! ఎయిర్ చీఫ్!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ చేసి బాంబు దాడులతో ద్వంసం చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ ఎయిర్ స్ట్రైక్ మీద ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ చీఫ్ వివరణ ఇవ్వడంతో పాటు, రక్షణ శాఖ కూడా దాడుల గురించి విపక్షాలకి తెలియజేసాయి.

 Air Chief Marshal Bs Dhanoa Gives Clarity On Airstrike1-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ దాడులు పూర్తయిన తర్వాత ఆ సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ మొత్తం అధికారంలో వున్న మోడీ ప్రభుత్వానికి వెళ్ళిపోతుందని గ్రహించిన రాజకీయ పార్టీలు, తమ చెత్త రాజకీయాలని మొదలెట్టి, బాలంకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేసారు అనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేయడం మొదలెట్టాయి.

అదే సమయంలో సైనికుల చర్యని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అంటూ విమర్శలు చేయడం మొదలెట్టాయి.

కాంగ్రెస్ తో పాటు విపక్షాల విమర్శలపై తాజాగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.మేము నిర్దేశించుకున్న లక్ష్యాలని, దానికోసం వేసుకున్న ప్లాన్స్ అమలు చేయడం మీదనే ద్రుష్టి పెడతామని, సర్జికల్ దాడులు చేసేంత వరకే తాము చూసుకుంటాము.

ఇక అక్కడ ఎంత మంది చనిపోయారు అనే విషయాలు అన్ని ప్రభుత్వానికి కావాలి, ప్రభుత్వం చూసుకోవాలి.సర్జికల్ స్ట్రైక్ చేసామనేది నిజం అని స్పష్టం చేసారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube