ప్రారంభం అయిన రవితేజ డిస్కో రాజా మూవీ!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తుల్లూరి నిర్మాణంలో తెరకెక్కబోయే డిస్కో రాజా సినిమా ప్రారంబోత్సవం శివరాత్రి సందర్భంగా ఈ రోజు జరిగింది.టైం ట్రావెల్ నేపధ్యంలో రవితేజ కెరియర్ లో డిఫరెంట్ జోనర్ లో పీరియాడికల్, ప్రెజెంట్ కథాంశంతో ఈ సినిమాని దర్శకుడు విఐ ఆనంద్ ఆవిష్కరించబోతున్నాడు.

 Massmaharaja Discoraja Movie Shooting Begins-TeluguStop.com

ఇక చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ ని డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ కెరియర్ లో మరో భారీ బడ్జెట్ చిత్రంగా డిస్కో రాజా ఉండబోతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో రవితేజకి జోడీ గా ఆర్ ఎక్స్ 100 తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్, అలాగే టాక్సీ వాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన క్రేజీ తెలుగు బ్యూటీ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్స్ గా ఫైనల్ అయ్యారు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.మరి ఇప్పటికే రెండు విభిన్న కథలతో సక్సెస్ కొట్టిన విఐ ఆనంద్ రవితేజతో చేస్తున్న మూడో సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube