8 లక్షల ఓట్లు తొలగింపుపై దరఖాస్తు! ఎలక్షన్ కమీషనర్ సీరియస్!

ఏపీలో అక్రమ మార్గంలో ఓట్ల తొలగింపు జరుగుతుంది అని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ ఓట్ల తొలగింపుని అక్రమంగా చేస్తుందని భావిస్తూ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ మీద సైబర్ క్రైమ్ పోలీసులకి వైసీపీ ప్రతినిధులు ఫిర్యాదు చేసారు.

 Election Commission Serious On Removing Of Votes Issue-TeluguStop.com

ఇప్పుడు ఈ రగడ రెండు రాష్ట్రాల గొడవగా మార్చే ప్రయత్నం అధికార పార్టీ టీడీపీ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా వుంటే ఎన్నికల సంఘానికి ఏకంగా 8 లక్షల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలియజేసారు.

ఫారం-7 క్రింద ఆ ఓట్లు తొలగించలేదని, మూడు దశలలో పరిశీలించిన తర్వాత ఆ ఓటుకి సంబంధించిన ఓటర్ వున్నాడా లేదా అనేది నిర్ధారించుకొని ఓట్ల తొలగింపు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారి తెలియజేసారు.అలాగే ఓటర్ల ప్రమేయం లేకుండా ఓట్ల తొలగింపుకి ఎలా దరఖాస్తులు వచ్చాయి అనే విషయం మీద విచారణ చేసి దీనికి భాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేసారు.

ఈ విషయంలో ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , ఎన్నికల నాటికి అంతా క్లియర్ అవుతుంది అని గోపాలకృష్ణ ద్వివేది చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube