తెలంగాణలో టీడీపీ పార్టీ మాయం అవుతున్నట్లే! టీఆర్ఎస్ వైపు ఇద్దరు ఎమ్మెల్యేలు!

తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలో కనుమరుగుతుందా అంటే అవుననే మాట ఇప్పుడు వినిపిస్తుంది.తెలంగాణ రాష్ట్రం విడిపడిన తర్వాత ఏపీకి పూర్తిగా పరిమితం అయిపోయిన తెలుగు దేశం, తెలంగాణ ఎన్నికలలో కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లు సొంతం చేసుకుంది.

 Tdp Mlas Set To Join Trs-TeluguStop.com

అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ తెలుగు దేశం నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు.దీంతో తాజాగా జరిగిన ఎన్నికల సమయానికి తెలంగాణలో టీడీపీకి పూర్తి స్థాయిలో అభ్యర్ధులు లేక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని పోటీ చేయాల్సి వచ్చింది.

ఎన్నికలలో టీడీపీ కేవలం రెండు సీట్లుకి మాత్రమె పరిమితం కాగా తాజాగా అందులో టీడీపీ తరుపున అశ్వారావు పేట నుంచి మచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా వున్నారు.వీరిలో సండ్ర వెంకట వీరయ్య తాజాగా కేసీఆర్ తో బేటీ అయ్యి త్వరలో టీఆర్ఎస్ చేరబోతున్నట్లు స్పష్టం చేసారు.

మరో వైపు మచ్చాని కూడా టీఆర్ఎస్ లోకి చేర్చుకోవాలని ప్లాన్ లో కెటీఆర్ టీం వున్నట్లు తెలుస్తుంది.మరో వైపు టీడీపీ క్యాడర్ మీద ద్రుష్టి పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అందులో కీలక నేతలని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

దీంతో తెలంగాణ టీడీపీ అంకం చివరి దశకి చేరుకుంటుంది అని టాక్ ఇప్పుడు రాజకీయాలలో వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube