అభినందన్‌ పాక్‌లో దిగిన సమయంలో ఏం జరిగింది... వైరల్‌ అవుతున్న అంతర్జాతీయ మీడియా కథనం

భారత వింగ్‌ కమాండర్‌ విక్రమ్‌ అభినందన్‌ను పాకిస్థాన్‌ ఏమీ చేయకుండా గౌరవంగా ఇండియాకు అప్పగించింది.జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను ఇండియాకు అప్పగించిన పాకిస్థాన్‌ కొన్ని కుయుక్తులు పన్నింది.

 What Happened To Abhinandan When He Is In Pakistan-TeluguStop.com

అయితే వాటన్నింటిని కూడా అంతర్జాతీయ మీడియా బయట పెడుతుందనే భయంతో ఎలాంటి గొడవ లేకుండా పంపించింది.అయితే అభినందన్‌ పాకిస్థాన్‌లో క్రాష్‌ ల్యాండ్‌ అయిన సమయంలో ఏం జరిగింది అనే విషయాలపై అంతర్జాతీయ మీడియా సంస్థలు బిబిసి మరియు కొన్ని ఇతర సంస్థలు రకరకాల కథనాలను ప్రచురిస్తుంది.

ఆ కథనాల ప్రకారం అభినందన్‌ పాకిస్థాన్‌ యుద్ద విమానంను కూల్చివేసిన తర్వాత పాక్‌ గడ్డపై పడ్డాడు.ఆ విషయాలను స్థానికుల కథనం అంటూ అంతర్జాతీయ మీడియా ప్రచురించడం జరిగింది.

ఆ కథనాల్లో… అభినందన్‌ విమానం కూలుతున్న సమయంలో ప్యారచుట్‌ సాయంతో బయట పడ్డాడు.ఆయన ప్యారచుట్‌ పై జాతీయ జెండా ఉండటంతో అతడు ఇండియాకు చెందిన వ్యక్తి అని పాకిస్థాన్‌ వారికి అర్థం అయ్యింది.

కింద పడ్డ అభినందన్‌ తాను ఎక్కడ పడ్డాను, ఇది ఏ ప్రాంతం అంటూ అడిగాడట.అప్పుడు స్థానికులు కొందరు ఇది ఇండియా అంటూ అబద్దం చెప్పడం జరిగిందట.

దాంతో వెంటనే భారత్‌ మాతాకి జై అంటూ అభినందన్‌ నినాదాలు చేశారు.అభినందన్‌ ఆ నినాదాలు చేయడంతో పాకిస్థాన్‌కు చెందిన కొందరు యువకులు అదే సమయంలో పాక్‌ జిందాబాద్‌ అంటూ నినదించారట.

దాంతో వెంటనే అనుమానం వచ్చిన అభినందన్‌ తన వద్ద ఉన్న పిస్తోల్‌ ను బయటకు తీశాడట.

గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడ నుండి పరిగెత్తే ప్రయత్నం చేశాడు.అయితే అప్పటికే అభినందన్‌ చుట్టు పెద్ద సంఖ్యలో జనాలు చేరారు.వారు తనను ఏదైనా చేసే అవకాశం ఉందని భావించాడు.

దాంతో దాదాపు అరకిలోమీటరు మేరకు వారిని తప్పించుకుని పరిగెత్తాడు.అక్కడి వారికి తాను చిక్కన తప్పదనుకున్న అభినందన్‌ తెలివిగా తన వద్ద ఉన్న పత్రాలను మరియు కొన్ని ముఖ్యమైన మ్యాప్‌లను నీటిలో పడేయడంతో పాటు కొన్నింటిని నమిలేశాడట.

ఆ తర్వాత అభినందన్‌ ను స్థానిక మూక కొట్టడం, ఆ వెంటనే అక్కడకు పాక్‌ ఆర్మీ జవాన్‌లు వచ్చి అభినందన్‌ను అక్కడ నుండి తీసుకు వెళ్లడం జరిగిందట.

పాకిస్థాన్‌లో పడ్డ తర్వాత కూడా భారత్‌ మాతాకి జై అంటూ నినదించి, పాక్‌ గడ్డపై మన దేశం సత్తా చాటిన రియల్‌ హీరో అభినందన్‌.మరెవ్వరైనా కూడా అభినందన్‌ లా సమయస్ఫూర్తితో వ్యవహరించే వారు కాదని జాతీయ మరియు అంతర్జాతీయ మీడియా కూడా ప్రశంసిస్తుంది.మరో వైపు పాక్‌ మీడియా కూడా అభినందన్‌ ధైర్య సాహసాలను సమయస్ఫూర్తి గురించి కథనాలు రాస్తున్నారు.

మన రియల్ హీరో అభినందన్ గారికి సెల్యూట్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube