శ్రీకాకుళంలో భారీగా గంజాయి స్వాధీనం!

ఉత్తరాంద్రలో అరుకు, అలాగే ఒరిస్సా బోర్డర్ లో అటవీ ప్రాంతాలలో అక్రమ గంజాయి సాగు ఎక్కువగా వుంటుంది.అలాగే అటు వైపు నుంచి గంజాయి ఎక్కువగా ఇతర ప్రాంతాలకి సరఫరా అవుతూ వుంటుంది.

 Andhra Police Seize Ganja Being Smuggled-TeluguStop.com

అప్పుడప్పుడు అక్రమంగా గంజాయిని తరలించే ప్రయత్నంలో పోలీసులకి పట్టుబడిన కూడా మళ్ళీ మళ్ళీ ఈ గంజాయి అక్రమ రవాణా జరుగుతునే వుంటుంది.అయితే ఈ సారి ఏకంగా భారీ స్థాయిలో గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కంచిలి మండలం జలాంతర కొంత జంక్షన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సమయంలో డీసిఎం వాన్ లో తరలిస్తున్న సుమారు ఎనిమిది వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

ఇక ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.అయితే ఈ గంజాయిని వాళ్ళు ఎక్కడికి తరలిస్తున్నారు.ఈ స్థాయిలో గంజాయిని ఎ ప్రాంతంలో సాగు చేస్తున్నారు అనే విషయాలని పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube