ఇలాంటి అవుట్ మీరెప్పుడు చూసుండరు..! దురదృష్టమంటే ఈమెదే..! ఆశ్చర్యానికి గురి చేసిన వైరల్ వీడియో!

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.క్రికెట్‌లో చిత్రవిచిత్రమైన ఔట్లను ఎన్నో మీరు చూసే ఉంటారు.

 New Zealand Batter Dismissed In The Most Bizarre Fashion-TeluguStop.com

కానీ తాజాగా న్యూజిలాండ్ మహిళల టీమ్‌కు చెందిన కేటీ పెర్కిన్స్ ఔటైన తీరు మాత్రం మరీ చిత్రంగా ఉంది.

వివరాల లోకి వెళ్తే…ఆస్ట్రేలియా గవర్నర్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పెర్కిన్స్ ఆడిన షాట్ నాన్‌ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కేటీ మార్టిన్ బ్యాట్‌కు తగిలి అమాంతం గాల్లోకి లేచింది.

అదే సమయంలో అక్కడే ఉన్న బౌలర్ గ్రాహమ్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో పెర్కిన్స్‌ రిటర్న్‌ క్యాచ్‌గా పెవిలియన్‌ చేరింది.

ఇలాంటి ఔట్ మీరెప్పుడైనా చూశారా అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంటేటర్ మెల్ జోన్స్ వ్యాఖ్యానించడం విశేషం.నిజంగా ఆమె ఔటైందా అంటూ కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు.ఆ వీడియో మీరు ఒక లుక్ వేయండి.

దురదృష్టమంటే ఈమెదే అంటూ క్రికెట్.కామ్ అనే వెబ్‌సైట్ ఈ వీడియో పోస్ట్ చేసింది.ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఈ మ్యాచ్‌లో కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 323 పరుగుల చేసింది.అనంతరం ఆస్ట్రేలియా గవర్నర్స్ ఎలెవన్ జట్టు 157 పరుగులకే ఆలౌటైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube