నేను మొదటి సారి విమానం ఎక్కాను, ఒకవేళ నేను ఏడిస్తే దయచేసి క్షమించండి.. బుజ్జి పాపాయి సందేశం

విమాన ప్రయానంలో అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు.అయితే ఎవరైనా చిన్న పిల్లలు విమాన ప్రయాణంలో చిరాకు పెడితే మిగిలిన ప్రయాణికులు అంతా కూడా ఇబ్బంది పడతారు.

 Mom Hands Out 200 Earplugs On Plane Fearing Baby May Cry Korean Candy-TeluguStop.com

ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విమానాల్లో పిల్లలు ఉంటే, ఆ విమానంలో ప్రయాణించే వారికి పదే పదే చిరాకు కలిగే అవకావం ఉంటుంది.కొంత మంది పిల్లలు పదే పదే ఏడ్చే అవకాశం ఉంటుంది.

అయితే ముందు జాగ్రత్తగా ఒక మహిళ తన చిన్నారి ఏడ్చినా ఇతర ప్రయాణికులు ఏమనకుండా జాగ్రత్త పడింది.ఆమె ప్రయత్నింను అంతా కూడా అభినందిస్తున్నారు.

కొరియా నుండి అమెరికాకు వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆ విమానంలోని ప్రతి ఒక్కరికి ఒక ప్యాకెట్‌ ఇవ్వడం జరిగింది.

ఆ ప్యాకెట్‌ పై.హలో, నా పేరు జున్వూ, నాకు 4 నెలల వయసు.నేను మొదటి సారి విమానంలో ప్రయాణించబోతున్నాను.అమ్మమ మరియు ఆంటీని కలిసేందుకు నేను అమెరికా వెళ్తున్నాను.నేను మొదటి సారి విమానంలో ప్రయాణించబోతున్న కారణంగా నాకు కాస్త కంగారుగా ఉంది, ఆ కంగారులో నేను ఏడవచ్చు, లేదంటే కేకలు పెట్టవచ్చు.

నేను నిశబ్దంగా ప్రయాణించాలని భావిస్తున్నాను, కాని నేను అలా ప్రయాణిస్తానో లేదో చెప్పలేను.ఒక వేళ నేను ఏమైనా ఇబ్బంది పెడితే దయచేసి క్షమించండి.మీ కోసం మా అమ్మ ఈ ప్యాకెట్‌ లో నా శబ్దంను భరించేందుకు ఇయర్‌ బగ్స్‌ను ఇంకా కొన్ని చాక్లెట్స్‌ను కూడా ఇచ్చింది.

వాటిని ఉపయోగించుకోండి.ఈ ప్రయాణాన్ని నాతో పాటు మీరు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ లెటర్‌ లో ఉంది.

ఈ లేఖ అందుకున్న ప్రతి ఒక్కరు కూడా జున్వూ వద్దకు వెళ్లి మరీ హ్యాపీ జర్నీ చెప్పడంతో పాటు, ఆమె తల్లి చేసిన ప్రయత్నంను అభినందించారు.

దాంతో పాటు పాప ఏడ్చినా కూడా తామేమి ఇబ్బంది పడము, చిరాకు పడము, మీరు నిశ్చితంగా ప్రయాణించండి అంటూ పాప తల్లికి హామీ ఇవ్వడం జరిగింది.అన్నట్లుగానే ప్రయాణం అంతా సాఫీగా సాగింది.ఈ సరదా విషయాన్ని ఫేస్‌బుక్‌లో డవే కరోనా అనే మహిళ పోస్ట్‌ చేసింది.

ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌ అయ్యింది.అయితే విమాన ప్రయాణ సమయంలో ఆ పాప ఏడ్చిందా లేదంటే ప్రయాణం సాఫీగా సాగిందా అనే విషయాన్ని మాత్రం ఆమె తెలియజేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube