అమెరికాకే వెళ్తాం...భారతీయ విద్యార్ధులు...!!!

అమెరికాలో చదువుకోవాలనే కోరిక, అక్కడే స్థిరపడి ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే ధృడ సంకల్పం భారతీయ విద్యార్ధులకి ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి.ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి మొదలు భారతీయ విద్యార్ధులు అమెరికా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.

 Indian Students Interested To Study In Usa-TeluguStop.com

కొంత కాలం క్రితం జరిగిన అక్రమ వీసా విద్యార్ధుల అరెస్ట్ లతో విద్యార్ధుల సంఖ్య దాదాపు తగ్గిపోతుందని అనుకున్నారు.కానీ

ప్రతీ ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది తప్ప ఏ మాత్రం తరగడం లేదు.అమెరికా – ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, స్వయంగా విషయాలని వెల్లడించింది.తెలివితేటలు గల విద్యార్థులు తమ పరిశోధన అనుభవాలు పంచుకోవడానికి సదరు సంస్థ మూడు రోజులుపాటు కేరళా లో సమావేశాలు ఏర్పాటు చేసింది.ఈ సమావేశానికి హాజరైన యూఎస్ఐఈఎఫ్ డైరెక్టర్ ఆదమ్ గ్రోట్స్‌కీ మాట్లాడుతూ

ఇండియా నుంచీ అమెరికా వచ్చి విద్యని అభ్యసించాలని అనుకునే వారి సంఖ్య పెరుగుతోందని 2016-17 సంవత్సరంలో ఇండియా నుంచీ సుమారు 1,86,267విద్యార్థులు అమెరికా రాగా…2017-18 సంవత్సరంలో 1,96, 271 విద్యార్థులు వచ్చినట్టుగా ఆమె స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube