మందు పంచి పెడితే ఓటు వేయం... ఆ గ్రామస్తుల నిర్ణయం దేశ ప్రజలకు ఆదర్శం

ఈమద్య కాలంలో ఎన్నికలు అంటే మద్యం ఏరులై పారుతోంది.మామూలు సమయంలో కంటే ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు దాదాపు పది రెట్టు ఎక్కువగా ఉంటున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 Women In Maharashtra Village Decide Not To Vote For Parties-TeluguStop.com

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికలు అంటే మద్యం ఏరులై పారుతోంది.మద్యం పోసి ఓట్లు కొనేయాలని నాయకులు భావిస్తున్నారు.

జనాలు కూడా ఎవరు మద్యం పోసినా కూడా వద్దనకుండా తీసుకుంటున్నారు అంటూ నాయకులు కూడా అంటున్నారు.ఓటు ఎటు వేసేది తర్వాత సంగతి కాని మొదట అయితే మద్యం తీసుకుంటున్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన గడ్చిరౌలి జిల్లాలోని ఒక గ్రామ మహిళలు కీలక నిర్ణయం తీసుకున్నారు.వారి ఊర్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా మద్యం పంచకూడదని కండీషన్‌ పెట్టారు.

డబ్బు మద్యం ఎవరైతే పంచి పెడతారో వారిపై కేసు పెడతామని, వారికి ఓట్లు కూడా వేయమని ప్రకటించారు.ఊర్లో ఒక్క మద్యం బాటిల్‌ పంచిపెట్టినట్లుగా మాకు తెలిసినా కూడా వారిని బహిష్కరిస్తామని ప్రకటించారు.

గ్రామంలో మద్యం పంచి పెట్టకుండా, మాకు గెలిచిన తర్వాత మంచి పనులు చేయాలని ఆ గ్రామ మహిళలు కోరుతున్నారు.

మద్యం పోసి, డబ్బులు పంచిన వాడు ఎవడైనా మంచి చేస్తాడని భావించలేం.ఎందుకంటే డబ్బులు ఖర్చు చేసిన వాడు ఖచ్చితంగా మళ్లీ సంపాదించుకోవాలనుకుంటాడు.అలాంటప్పుడు అతడు ఎలా ప్రజలకు సేవ చేస్తాడు అనేది కొందరి మాట.అందుకే ఆ గ్రామస్తులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.వారు తీసుకున్న నిర్ణయం దేశం మొత్తం ఆదర్శనీయంగా తీసుకోవాలి.

ఇలాంటి నిర్ణయంను దేశ ప్రజలు అంతా కూడా తీసుకుంటే చాలా మంచిది అంటూ కొందరు కోరుకుంటున్నారు.కాని ఆ గ్రామంలో ప్రజలు తీసుకున్నంత మంచి నిర్ణయం ఎవరు తీసుకోరు.

గ్రామ పంచాయితీ ఎన్నికలకు సైతం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్న నాయకులు ఉన్న సమయంలో డబ్బు తీసుకోకుండా, మద్యం తీసుకోకుండా జనాలు మాత్రం ఎలా ఓట్లు వేస్తారు లేండి.

ఓటును 500 రూపాయలు, 1000 రూపాయలకు అమ్ముకునే రోజు ఎప్పుడు పోతుందో అప్పుడు దేశం బాగు పడుతుంది.ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే షేర్‌ చేయండి.ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చేలా ఈ విషయాన్ని వైరల్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube