సర్జికల్స్ స్ట్రైక్స్‌ కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారు.? ప్రత్యేకతలు ఇవే..!

చెప్పినట్టుగానే, హెచ్చరించినట్టుగానే భారత్ ప్రతీకారం తీర్చుకుంది.జవాన్ల ప్రాణత్యాగాలకు అంతకు అంత బదులు తీర్చుకుంది.

 Mirage 2000 Fighter Jet Specifications-TeluguStop.com

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది.అత్యాధునిక మిరాజ్ 2000 విమానాలతో బాంబుల వర్షం కురిపించి ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది భారత్ వైమానిక దళం.దాదాపు 300 పైగా ఉగ్రవాదులు మరణించారు ఈ దాడిలో.ఇది ఇలా ఉండగా… ఇప్పుడు మిరాజ్‌ 2000 దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇప్పుడే కాదు… కార్గిల్ యుద్ధంలోనూ కీలక పాత్ర పోషించాయి.ఈ క్రమంలో మిరాజ్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే…

భారత వైమానిక దళంలో ఉన్న అతిముఖ్యమైన యుద్ధవిమానాల్లో మిరాజ్ 2000 ఒకటి.1999‌లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత్ వీటిని ఉపయోగించింది.1985లో ఇవి భారత వైమానిక దళంలో చేరాయి.వీటికి వజ్ర అని నామకరణం చేశారు.

ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అనేక యుద్ధల్లో సత్తా చాటాయి.1970లో మిరాజ్ తయారీ మొదలైతే 1984 నుంచి ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందించేది.

మిరాజ్ 2000లో సింగిల్ సీటర్, టూ సీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి.

ఈ విమానంలో తొమ్మిది చోట్లకు ఒకేసారి ఆయుధాలను తీసుకెళ్లొచ్చు.మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది.

పగలు, రాత్రి లేజర్‌ – గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయొచ్చు.

ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు.మిరాజ్ 2000 గంటకు 2,530 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

ప్రస్తుతం భారతదేశం దగ్గర 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి.

మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, వార్ మిస్సైల్స్ , మ్యాజిక్-2 మిస్సైల్స్‌ను మిరాజ్ మోసుకెళ్లగెలదు.కార్గిల్ యుద్ధ సమయంలో ఇవి భారత దేశానికి కీలకంగా వ్యవహరించాయి.నాటి యుద్ధంలో శత్రు స్థావరాలను ధ్వంసం చేసి తిరిగి వాయుసేన స్థావరాలకు తిరిగి వచ్చి…కార్గిల్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడటంలో మిరాజ్-2000 విమానాలది కీలకపాత్ర.

ఈ ప్రత్యేకత వ్లల రాడార్లలో దీన్ని గుర్తించడం శత్రు శిబిరానికి కష్టంగా మారిపోతుంది.

లేజర్‌ గైడెడ్‌ బాంబులను కూడా మిరాజ్‌ ప్రయోగించగలదు.అందుకే చకచకా పూర్తి కావాల్సిన ఆపరేషన్లకు భారత వాయుసేన మిరాజ్‌నే ఎంచుకొంటుంది.

మిరాజ్ కు పోటీగా పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలను రంగంలోకి దించినా.మిరాజ్ తో పోటీ పడలేక తిరిగి వెళ్లిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube