పాకిస్తాన్ పై ప్రపంచ దేశాలు ఒత్తిడి! అయిన బుద్ధి మార్చుకొని పాక్!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ ని రెచ్చగొట్టే విధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే విధంగా, యుద్ధ సంకేతాలు పంపిస్తూ, భారత్ ని రెచ్చగొడుతుంది.అయితే భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ చొరబాట్లుని అడ్డుకునే ప్రయత్నం మాత్రమె చేస్తుంది.

 India Calls For Immediate Return Of Pilot Shot Down By Pakistan-TeluguStop.com

అయితే పాకిస్తాన్ మాత్రం ఓ వైపు శాంతి వచనాలు వల్లిస్తూ మరో వైపు భారత్ ని రెచ్చగొట్టే విధంగా సరిహద్దు గ్రామాలలో ప్రజలే లక్ష్యంగా దాడులకి పాల్పడుతుంది.అయితే ఈ దాడులని ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది.

ఇదిలా వుంటే ఇప్పటికే పాకిస్తాన్ ని ప్రపంచ దేశాల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి.వెంటనే కవ్వింపు చర్యలు ఆపేసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా దేశాలు పాకిస్తాన్ లో జైషే మహ్మద్ ని నిషేధించి, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు అజార్ మసూద్ ఆస్తులు స్వాదీనం చేసుకొని, అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసాయి.మరో వైపు భారత్ ప్రధాని మోడీ కూడా జెనీవా ఒప్పందం ప్రకారం ఏడు రోజులలో యుద్ధఖైదిగా దొరికిన తమ సైనికుడుని అప్పగించాలని లేదంటే యుద్ధం వచ్చినట్లే భావించాలని పాకిస్తాన్ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయితే పాకిస్తాన్ మాత్రం శాంతి వచనాలు వల్లిస్తూనే మళ్ళీ యుద్ధ సన్నాహాలు చేస్తూ వుండటం ప్రపంచం మొత్తం చూస్తూ వుంది అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube