మద్యం పిచ్చితో ఇతగాడు ఎంత పని చేశాడో చూడండి.. చేతిపై ఐడీ కార్డ్‌ టాటూ

ఈమద్య కాలంలో టాటూలు చాలా కామన్‌ అయ్యాయి.ఎక్కువ మంది స్టైల్‌ కోసం అంటూ టాటూలు వేయించుకుంటున్నారు.

 Guy Who Always Forgot His Id Card Has It Tattooed On Forearm-TeluguStop.com

ఎక్కువ శాతం మంది పర్మినెంట్‌ టాటూలను వేయించుకుంటున్నారు.అయితే ఎక్కువ శాతం మంది డిజైన్స్‌ను టాటూలుగా వేయించుకుంటూ ఉంటే, కొందరు మాత్రం తమ పేర్లను లేదంటే తమకు చెందిన వారి పేర్లను వేయించుకుంటూ ఉంటారు.

అయితే వియత్నంకు చెందిన ఒక యువకుడు మాత్రం తన ఐడీ కార్డ్‌ను టాటూగా వేయించుకున్నాడు.ఇతడు చేసిన పని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతుంది.

వియత్నం హోచి మిన్ష్‌ అనే నగరంలో సుజకే అనే కుర్రాడు మద్యంకు బాగా బానిస అయ్యాడు.అతడు మద్యం తాగేందుకు వయసు సరిపోను లేదు అంటూ కొందరు వైన్స్‌ షాప్‌ వారు అతడికి మద్యం ఇచ్చేందుకు ఒప్పుకోరు.

అప్పుడు అతడు వియత్నంకు సంబంధించిన అధికారిక ఐడీ కార్డ్‌ను చూపిస్తే అతడి ఏజ్‌ను బట్టి మద్యం ఇస్తూ ఉండేవారు.అయితే ఇతడికి ఉన్న మతిమరుపు కారణంగా ఎప్పటికప్పుడు ఆ ఐడీ కార్డ్‌ను మర్చి పోతూ ఉండేవాడు.

ఐడీ కార్డ్‌ను మర్చి పోవడం వల్ల మద్యం షాపుల్లో మరియు పోలీసుల వద్ద చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది.

తన సమస్యల పరిష్కారంకు ఒకటే మార్గంగా భావించిన అతగాడు చేతిపై ఐడీ కార్డ్‌ను టాటూగా వేయించుకున్నాడు.టాటూ వేసే వ్యక్తి వద్దని వారించినా కూడా అతడు కావాలని పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టాటూను వేసినట్లుగా చెప్పుకొచ్చాడు.చేతిపై ఉన్న టాటూ ఐడీ కార్డ్‌ అతడికి గుర్తింపును ఇస్తుందా లేదా అనేది తనకు తెలియదు, కాని అతడు వేయమన్నట్లుగా ఐడి కార్డ్ ను వేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈ విషయంలో సోషల్ మీడియాలో జనాలు ఆ కుర్రాడిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube