నాని 'గ్యాంగ్‌ లీడర్‌' క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ఇది చూస్తే మీకే అర్థం అవుతుంది

యంగ్‌ హీరో నాని ప్రస్తుతం చేస్తున్న ‘జెర్సీ’ విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న జెర్సీ చిత్రం ఏప్రిల్‌ లో విడుదల కానుంది.

 Hero Nani Gang Leader Movie Creage In His Fans-TeluguStop.com

ఆ వెంటనే విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని ఒక చిత్రాన్ని చేయనున్నాడు.ఇప్పటికే సినిమా టీజర్‌ మరియు టైటిల్‌ వచ్చింది.

ఈ చిత్రానికి ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ అవ్వడంతో ఈ టైటిల్‌తో నాని దున్నేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

దానికి తోడు విక్రమ్‌ కుమార్‌ మూవీస్‌ చాలా విభిన్నంగా ఉంటాయి.తప్పకుండా నాని క్రేజ్‌ను ఈ చిత్రం పెంచుతుందని అంతా నమ్ముతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఇదే సమయంలో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో 5.25 కోట్లకు సరిగమ సినిమాస్‌ వారు కొనుగోలు చేశారు.నానికి ఓవర్సీస్‌లో మంచి క్రేజ్‌ ఉంది.

విక్రమ్‌ కుమార్‌ సినిమాలను కూడా ఓవర్సీస్‌ ప్రేక్షకులు బాగా ఆధరిస్తారు.అందుకే ఈ చిత్రంను ముందే ఓవర్సీస్‌ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది.

నాని, విక్రమ్‌ కుమార్‌ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఓవర్సీస్‌ రైట్స్‌ ద్వారా తెలిసి పోతుంది.అన్ని ఏరియాల్లో కూడా ఇదే తరహాలో మూవీ బిజినెస్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం సినిమాకు అన్ని ఏరియాల్లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.కాని సినిమాను మాత్రం ఇంకా అమ్మలేదు.ప్రస్తుతానికి ఓవర్సీస్‌లో మాత్రమే సినిమాను బిజినెస్‌ చేయడం జరిగిందట.విడుదలకు ముందే ఈ చిత్రం 30 కోట్లకు పైగా బిజినెస్‌ చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube