చరణ్‌ చెత్త రికార్డును బాలయ్య బ్రేక్‌ చేసే అవకాశం.. మెగా ఫ్యాన్స్‌ హ్యాపీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ తాజాగా తన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఓవర్సీస్‌లో కేవలం 2.6 లక్షల డాలర్లను మాత్రమే వసూళ్లు చేశాడు.మినిమం రెండు మిలియన్‌ల డాలర్లను వసూళ్లు చేస్తుందని అంతా భావించారు.కాని అనూహ్యంగా రెండు లక్షల డాలర్లనే వినయ విధేయ రామ చిత్రం వసూళ్లు చేసింది.ఇంత తక్కువ వసూళ్లు చేయడంతో చెత్త రికార్డు రామ్‌ చరణ్‌ ఖాతాలో పడింది.అత్యంత దారుణమైన కలెక్షన్స్‌ను నమోదు చేసిన చిత్రంగా వినయ విధేయ రామ రికార్డు సొంతం చేసుకుంది అంటూ నందమూరి అభిమానులు ఎద్దేవ చేశారు.

 Balakrishna To Break The Worst Record Of Ram Charan-TeluguStop.com

తాజాగా మహానాయకుడు ఆ రికార్డును తన ఖాతాలో వేసుకునేలా ఉంది.

ఇటీవలే విడుదలైన ‘మహానాయకుడు’ చిత్రం ఓవర్సీస్‌ లో కనీసం మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం ఖాయం అనుకున్నారు.కాని అక్కడ ఇప్పటి వరకు కేవలం రెండు లక్షల డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది.చరణ్‌ రికార్డును బ్రేక్‌ చేయాలి అంటే ఇంకా 60 వేల డాలర్లను వసూళ్లు చేయాల్సి.

కాని ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే 60 వేల డాలర్ల కాదు కదా కనీసం ఆరు వేల డాలర్లను కూడా వసూళ్లు చేసే పరిస్థితి లేదు.మొదటి మూడు రోజుల్లో వచ్చిన రెండు లక్షల డాలర్లతోనే కలెక్షన్స్‌ క్లోజ్‌ అయ్యే అవకాశం ఉంది.

ఓవర్సీస్‌లో మెగా హీరో పేరుతో ఉన్న చెత్త రికార్డు నందమూరి హీరో బాలకృష్ణకు దక్కడంతో మెగా ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు.బాలకృష్ణ ఈ రికార్డుకు కరెక్ట్‌ అర్హుడు అంటూ కామెడీ చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఓవర్సీస్‌కు సంబంధించిన కలెక్షన్స్‌ గురించి పెద్ద ఎత్తున మీమ్స్‌ వస్తున్నాయి.బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమాత్రం కలెక్షన్స్‌ను దక్కించుకోలేక పోతున్నాడు.30 నుండి 40 కోట్లు వసూళ్లు చేస్తుందని భావించిన మహానాయకుడు సినిమా కేవలం అయిదు కోట్ల వద్దే ఆగిపోయేలా కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube