కొత్త గ్యాస్‌ సిలిండర్లు వచ్చాయి... వీటి గురించి తెలిస్తే వెంటనే బుక్‌ చేస్తారు

మారుతున్న టెక్నాలజీతో మనం మారాలి, అప్పుడే మనం అభివృద్ది చెందినట్లుగా జనాలు భావిస్తారు.ప్రతి వస్తువు కూడా టెక్నాలజీ రంగు పులుముకుని కొత్త హంగులతో జనాల ముందుకు వస్తూ పనిని సులభతరం చేయడంతో పాటు, భద్రత పరంగా మరింత సౌలభ్యంను ఇస్తుంది.

 Safer Lighter Fibre Lpg Cylinders Coming Your Wa-TeluguStop.com

ఇలాంటి సమయంలో గ్యాస్‌ సిలిండర్లలో మార్పులు వచ్చాయి.చాలా ఏళ్ల నుండి కొనసాగుతూ వస్తున్న మెటల్‌ సిలిండర్ల స్థానంలో కొత్త సిలిండర్లు వస్తున్నాయి.

అందుకు సంబంధించిన నమూనాలు కూడా వచ్చాయి.

మెటల్‌ సిలిండర్లు పేలడం మనం వార్తల్లో వింటూనే ఉన్నాం.

ఆ సిలిండర్ల వల్ల ప్రాణ నష్టం కూడా భారీగా ఉంటుంది.సిలిండర్ల వల్ల కలిగే నష్టాలను భరించేందుకు గ్యాస్‌ సంస్థలకు తడిసి మోపెడు అవుతుంది.

అందుకే పేళని గ్యాస్‌ సిలిండర్‌లను తయారు చేయాలని నిర్ణయించారు.అందుకోసం తాజాగా పైబర్‌ గ్యాస్‌ సిలిండర్లను తయారు చేయడం జరిగింది.

అతి తక్కువ బరువు ఉండటంతో పాటు, మెటల్‌ సిలిండర్లతో పోల్చితే పేలడంలో 90 శాతం తక్కువ అవకాశం ఉంది.పేలినా కూడా పెద్ద ప్రమాదం అయితే ఉండదని తయారు చేసిన వారు చెబుతున్నారు.

రెండేళ్ల క్రితం ఇది తయారు అయినా కూడా పలు రకాల టెస్టుల తర్వాత దీన్ని బయటకు విడుదల చేయబోతున్నారు.

ప్రముఖ గ్యాస్‌ సంస్థలు అన్ని కూడా ఈ గ్యాస్‌ సిలిండర్లను తమ వినియోగదారులకు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.ఈ కొత్త గ్యాస్‌ సిలిండర్‌ కావాలి అంటే మెటల్‌ సిలిండర్‌ వెనక్కు ఇవ్వడంతో పాటు వెయ్యి రూపాయలు చెల్లిస్తే ఈ పైబర్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్లుగా కంపెనీ వారు చెబుతున్నారు.

మెటల్‌ సిలిండర్‌ వాడే వారు ఎప్పుడెప్పుడు అయిపోతుందో అనే భయం ఉంటుంది.కాని ఈ పైబర్‌ సిలిండర్స్‌లో మాత్రం గ్యాస్‌ ఇంకా ఎంత పరిమాణంలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.దాంతో కొత్త సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు.

పైబర్‌ సిలిండర్స్‌ తుప్పు పట్టే అవకాశం లేదు, యూవీ ప్రొటెక్ట్‌ అవ్వడం వల్ల మంచి మన్నికగా ఉంటుంది.కొన్ని ముఖ్య నగరాల్లో ఇవి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

అయితే తయారి కాస్త మెల్లగా జరుగుతున్న కారణంగా అందరికి అందుబాటులోకి రావాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.మీ గ్యాస్‌ ఏజెన్సి వద్ద ముందే ఈ సిలిండర్‌ కోసం బుక్‌ చేసుకుని పెట్టుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube