యంగ్ హీరో నాని ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఆ వెంటనే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు.
లేడీస్ గ్యాంగ్ లీడర్ గా రూపొందబోతున్న విభిన్నమైన చిత్రంలో నాని నటించబోతున్నాడు.నాని త్వరలో తనను హీరోగా పరిచయం చేసిన గురువు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఇంద్రగంటిపై ఉన్న అభిమానంతో ఆయన సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసేందుకు నాని ఓకే చెప్పాడంటూ వార్తలు వచ్చాయి.
ఆ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది.ఆ ప్రచారంకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది.తాజాగా నాని బర్త్డే సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
ఇంద్రగంటి దర్శకత్వంలో నటించే మాట నిజమే అని, అయితే నేను ఆ సినిమాలో హీరోగా చేయడం లేదని, అలా అని విలన్ గా కూడా చేయడం లేదని చెప్పుకొచ్చాడు.సుధీర్ బాబు హీరోగా నటించబోతున్న సినిమాలో నేను కీలక పాత్రలో నటించబోతున్నాను.
అయితే ఇది మల్టీస్టారర్ మూవీ కూడా కాదని నాని చెప్పుకొచ్చాడు.ఒక కీలకమైన పాత్రను మాత్రమే నేను చేస్తున్నాను, హీరోగా, విలన్ గా నటించడం లేదు అంటూ సుధీర్ బాబుకు సపోర్టింగ్ రోల్గా అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
నాని హీరోగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు.ఇలాంటి సమయంలో నాని ఇతర హీరోల సినిమాలో కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పడం అంటే మామూలు విషయం కాదు.ఇదో పెద్ద సాహస నిర్ణయం.హీరోగా స్టార్డంను కలిగి ఉన్న నాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గురువు కోరిక మేరకు ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పాడు.నాని స్టార్ డంతో సుధీర్ బాబు మూవీ స్థాయి అమాంతం పెరగడం ఖాయం.