బాబుకు జ‌గ‌న్‌కు ఇంత తేడా ఉందా...!

ఏపీలో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది.మే చివ‌రి వారంలో లేదా మ‌ధ్య‌వారంలోనే ఏపీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 Difference Between Chandrababu Naidu And Ys Jagan-TeluguStop.com

ఈ క్ర‌మంలో ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ నాయ‌కుడికి ఆ నాయ‌కుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.మాకు ఓటేయండి? అంటే మాకే ఓటే యండి! అంటూ ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.ముక్యంగా ఏపీలో త్రిముఖ పోటీ ఉంటుంద‌ని గ‌త కొన్ని రోజుల నుంచి భావిం చినా కూడా ఇప్పుడు మాత్రం పోటీ ద్విముఖంగానే మారిపోయింది.ఆది నుంచి ఎన్నో ఆశ‌లు క‌ల్పించిన జ‌న‌సేనాని.

ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయం అందిస్తాడ‌ని ఆశ‌లు పెట్టుకున్న ప‌వ‌న్ ఎన్నిక‌ల స‌మయానికి సైలెంట్ అయిపోవ డం.గ‌మ‌నార్హం.

ఇక ఎన్నిక‌ల‌కు ముందు 175 నియ‌జ‌క‌వ‌ర్గాలు, 25 ఎంపీ స్థానాల్లోనూ పోటీ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్.ఇప్పుడు మాత్రం ఆ ఊసే లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.క‌నీసం 50 స్థానాల్లోకూడా పోటీ చేసే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఈయ‌న విష‌యం ఇలా ఉంటే.ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌ద్దాం.ఈ పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓట్లు అర్ధిస్తోంది.

మాకే ఓట్లు వేయాల‌ని చెబుతోంది.అంతేకాదు, పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాను అన్ని సామాజిక వ‌ర్గాల‌కు అన్నీ చేశాన‌ని, వారి క‌న్నీళ్లు తుడిచి ఆర్థికంగా బ‌లోపేతం చేశాను కాబ‌ట్టి త‌న‌కే ఓటేయాల‌ని కోరుతున్నారు.ఇక‌, ఈయ‌న ఈ ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ఎక్క‌డిక‌క్క‌డ ఏక‌రువు పెడుతున్నారు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ప్ర‌జ‌ల‌లోకి వెళ్తోంది.త‌మ‌కు ఓటేయాల‌ని, త‌మ‌ను గెలిపించాల‌ని కోరుతోంది.అయితే, ఇక్క‌డే అధికార పార్టీకి, విప‌క్షానికి మ‌ధ్య పూర్తి వైరుద్యం క‌నిపిస్తోంది.త‌మ‌కు ఓటు వేయాల‌ని కోరుతున్న అధికార పార్టీ తాము ఐదేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు చేసిన మేలును ఏక‌రువు పెడుతున్నారు.

ఇక‌, ఇదే స‌మ‌యంలోవైసీపీ కూడా ఓట్లు కోరుతున్నా.ఈ ఐదేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌కు ఈ పార్టీ చేసిందేంట‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది.అయితే, తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం కాబ‌ట్టి చేసేందుకు ఏమీలేద‌ని చెప్పుకొన్నా.క‌నీసం ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారా? అసెంబ్లీకి పూర్తిగా హాజ‌రు వేయించుకున్నారా? ఎమ్మెల్యేలు ఎన్ని ప్ర‌జ‌లు సంధించి ప్ర‌జ‌ల క్షేమం కోసం ప‌నిచేశారు? అని ప్ర‌శ్నిస్తున్నారు.దీంతో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌లా మారింద‌ని అంటున్నారు పార్టీ నేత‌లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube