సాహో నుంచి శ్రద్ధా కపూర్ బర్త్ డే గిఫ్ట్! ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సాహో.యూనివర్శల్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

 Sahoo Movie Team Ready To Surprise For Shraddha Kapoor Birthday-TeluguStop.com

టాలీవుడ్, బాలీవుడ్ ఆర్టిస్ట్ లతో భారీ తారాగణంతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ మేకింగ్ వీడియో ని సాహో చాప్టర్ వన్ పేరుతో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చి సినిమా మీద అంచనాలు పెంచేశారు.

ఇదిలా వుంటే మరో సారి సాహో సినిమా నుంచి శ్రద్ధా కపూర్ బర్త్ డే సందర్భంగా మార్చి 3న సాహో చాప్టర్ 2 ని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.ఇక ఈ చాప్టర్ 2లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ మధ్య రొమాన్స్, అలాగే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాలని మేకింగ్ వీడియో ద్వారా ప్రెజెంట్ చేసే అవకాశాలు వున్నట్లు తెలుస్తుంది.

ఇక తెలుగు, హిందీ భాషలలో ఈ చాప్టర్ 2 మేకింగ్ వీడియో ని ఫ్యాన్స్ కోసం తీసుకొస్తూ వుండటంతో, ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube