వీరు కవల పిల్లలే, కాని తండ్రి మాత్రం ఒక్కరు కాదు.. ప్రపంచంలోనే అత్యంత వింత కవల పిల్లలు

ఒక తల్లి కడుపులో నుండి కొద్ది నిమిషాల తేడాతో పుట్టిన వారిని కవలలు అంటారనే విషయం తెల్సిందే.కొంత మంది కవలలు ఒకే రోజు జన్మించక పోవచ్చు, ఒకే వారంలో జన్మించక పోవచ్చు.

 This Are Twins But Not From One Father-TeluguStop.com

అంటే మొదట ఒకరు జన్మించిన తర్వాత మరో కవల పాప ఎంత గ్యాప్‌లో అయినా పుట్టవచ్చు.అంటే ఒకే కాన్పులో పుట్టిన వారిని కవలలు అనవచ్చు.

ఒకే కాన్పులో పుట్టిన కవల పిల్లలు ఇద్దరికి కూడా ఒకే తండ్రి అనడంలో ఎలాంటి సందేమం లేదు.ఒకే కాన్పులో పుట్టే పిల్లలకు తండ్రులు వేరుగా ఉండే అవకాశమే లేదు.

కాని లండన్‌లో మాత్రం ఇది సాధ్యం అయ్యింది.

ఇంగ్లాండ్‌కు చెందిన సైమన్స్‌ మరియు గ్రేయమ్‌లు స్నేహితులు.

వీరిద్దరు కూడా పెళ్లి చేసుకోకుండానే తండ్రులు అవ్వాలనుకున్నారు.అందుకోసం సరోగస్సి పద్దతిని వీరు ఆశ్రయించారు.

సరోగసి పద్దతి ద్వారా వీరిద్దరు కూడా తండ్రులు అవ్వాలని భావించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.అదేంటి అంటే వీరిద్దరు కూడా ఒకే తల్లితో తమ పిల్లలకు జన్మనివ్వాలని భావించారు.

లండన్‌కు చెందిన వీరికి అమెరికాకు చెందిన ఒక సరోగెట్‌ మదర్‌ లభించింది.

ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా వీరిద్దరు కూడా మెను తమ పిల్లలకు తల్లిని చేయాలని భావించారు.అందుకోసం కాస్త ఖర్చు అయినా పర్వాలేదని నిర్ణయించుకున్నారు.ఆ మహిళ గర్బంలోని అండాన్ని రెండుగా విడదీశారు.

ఆ రెండు అండ భాగాల్లో సైమన్స్‌ మరియు గ్రేయమ్‌ల వీర్యంను ప్రవేశ పెట్టడం జరిగింది.ఆ ప్రయోగం సక్సెస్‌ అవ్వడంతో ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

ఒకరు పాప కాగా, రెండవ వారు బాబుగా జన్మించారు.

కవల పిల్లలు వేరు వేరు తండ్రులు అంటూ ప్రపంచంలోనే అత్యంత వింత పిల్లలుగా వీరు రికార్డుల్లో నమోదు అయ్యారు.ప్రస్తుతం ఈ కవల పిల్లలకు 19 నెలలు.వారు వారి తండ్రుల వద్ద చాలా సంతోషంగా ఉంటున్నారు.

అరుదైన ఈ పిల్లల విషయం ఇప్పుడు ప్రపంచం ముందుకు రావడంతో అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube