టాలీవుడ్లో ఈమద్య కాలంలో చిన్న హీరోలు కూడా ఫస్ట్ రోజు రెండు మూడు కోట్ల వసూళ్లను రాబడుతున్నారు.ఇక స్టార్ హీరోలు అయితే కనీసం పది కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నారు.
భారీ క్రేజ్ ఉన్న సినిమాలు అయితే ఇరవై కోట్ల వరకు కూడా వసూళ్లు చేస్తున్నారు.మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్స్ పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి.
కలెక్షన్స్ భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రతి సినిమాను కూడా మొదటి వారం రోజులు ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు.చిన్న హీరోలు సైతం కోట్లలో వసూళ్లు చేస్తుంటే నందమూరి బాలకృష్ణ మాత్రం దారుణమైన కలెక్షన్స్ను నమోదు చేశాడు.
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం మొదటి రోజు 1.45 కోట్లను వసూళ్లు చేసినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నారు.అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కోటికి లోపే బాలకృష్ణ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఒక స్టార్ హీరో మూవీ, అది కాకుండా అత్యంత పెద్ద స్టార్ బయోపిక్ కేవలం కోటి లోపు వసూళ్లను నమోదు చేయడం ఏంటీ అంటూ అంతా కూడా అవాక్కవుతున్నారు.
బాలకృష్ణ టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకడు.అలాంటి హీరో మూవీకి మరీ ఇలాంటి కలెక్షన్స్ నమోదు అవ్వడం నిజంగా ఎవరు ఊహించని పరిణామం.ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరు ఊహించి ఉండరు.ఎందుకంటే ఎన్టీఆర్ మూవీ అంటే అత్యంత క్రేజీ మూవీ.దాంతో ఈజీగా వంద కోట్లు వసూళ్లు అవుతాయని భావించారు.కాని రెండు పార్ట్లు కలిపి కనీసం 10 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని వెళ్లడయ్యింది.
బాలకృష్ణ తన పరువును తీసుకోవడంతో పాటు, అన్నగారు ఎన్టీఆర్ గారి పరువును కూడా తీశాడంటూ నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.