టమాటాలు ఇవ్వనందుకు భారత్ మీద ఆటం బాంబ్ వేయాలన్న పాక్ జర్నలిస్ట్..! మనోళ్లు ఎలా ట్రోల్ చేసారో చూడండి!

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై అన్ని వైపుల నుంచి భారత్ ఒత్తిడి పెంచుతోంది.‘అత్యంత సన్నిహిత దేశం’ హోదాను ఉపసంహరించుకున్న భారత్.

 Pakistan Boycotts Indian Tomatoes After Pulwama Issue-TeluguStop.com

దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచింది.మరోవైపు, పుల్వామా దాడికి నిరసనగా భారత వ్యాపారులు పాక్‌కు టమాటాల సరఫరాను నిలిపివేశారు.

కావాలంటే ఉచితంగా పంపిణీ చేస్తాం కానీ, పాకిస్థాన్‌కు మాత్రం పంపేది లేదని స్పష్టం చేశారు.

భారత్ నుంచి టమాటాల సరఫరా నిలిచిపోవడంతో పాక్‌లో టమాటాల ధరలు ఆకాశాన్నంటాయి.కిలో టమాటాల ధర రూ.200 వరకు పెరిగింది.మరోవైపు, సరిహద్దు వద్ద టమాటాల లారీలు భారీగా నిలిచిపోయాయి.దేశంలో టమాటాల సంక్షోభం నెలకొనడంపై పాక్ మీడియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ విషయంపై ఓ పాక్ జర్నలిస్ట్ స్పందిస్తూ…భారత్ మీద ఏకంగా ఆటం బాంబ్ వేయాలంటూ వ్యాఖ్యానించారు.టమాటాలలతో మోదీ, రాహుల్ ముఖాలపై కొడతామని, టమాటాలకు అణుబాంబులతో సమాధానం ఇవ్వాలని ఆక్రోశం వ్యక్తం చేశాడు.కాగా, పాక్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.తమ స్టైల్ లో ట్రోల్ చేస్తున్నారు.

మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాడంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.కొందరైతే.‘భారత్‌ను ఆటం బాంబు నుంచి కాపాడేందుకు ఆ బికారి పాకిస్థానీకి 3 కేజీల టమాటాలు పంపించండిరా బాబూ’ అని ట్వీట్ చేస్తున్నారు.మరికొందరు ఇంకో జోక్ వెయ్యవా అంటూ వెటకారం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube