ఆ సేఫ్ ప్లేస్ ఎక్కడో...? చినబాబు కోసం పెదబాబు ఆరాటం !

ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ వారసులు తహతహలాడుతున్నారు.మిగతా పార్టీల్లో ఈ సందడి ఎలా ఉన్నా టీడీపీలో మాత్రం ఈ సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.

 Chandrababu Ground For Lokesh Contesting Seat-TeluguStop.com

ఏదో ఒకరకంగా ఈ ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దించేందుకు టీడీపీ సీనియర్లు ప్రయతినిస్తుంటే సాక్ష్యాత్తు టీడీపీ అధినేత కూడా తన వారసుడు ఐటీ మంత్రి లోకేష్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.ప్రస్తుతం లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నాడు.

మంత్రిగా ఉంటూనే పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.కాకపోతే దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అంటూ ప్రత్యర్థి పార్టీలు లోకేష్ ను తరుచూ విమర్శిస్తుండడంతో ఎలా అయినా ఈ ఆరోపణలకు చెక్ పెట్టాలని బాబు ఆలోచన.

అందుకోసమే ఏపీలో టీడీపీ కంచుకోట లుగా ఉన్న నియోజకవర్గాలపై బాబు దృష్టిపెట్టాడు.ఆ సేఫ్ ప్లేస్ నుంచే లోకేష్ ను బరిలోకి దించి ప్రతిపక్షాల నోర్లు మూయించాలని బాబు చూస్తున్నాడు.

ఈ సమయంలోనే బాబు దృష్టి మొత్తం తన సిట్టింగ్ స్థానం కుప్పంపైనే పెట్టాడు.అక్కడి నుంచే లోకేష్ ని పోటీకి దించి గెలుపొందాలని చూస్తున్నాడు.ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలు, అభివృద్ధి, సమీక్షలు వంటివి లోకేశ్ చేస్తున్నారు.వీలున్నప్పుడు పర్యటించి వస్తున్నారు.

ఎలాగూ ఎప్పుడో ఒకప్పుడు అక్కడి నుంచి లోకేశ్ ప్రాతినిధ్యం వహించక తప్పదు.అందువల్ల చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గాన్ని ఎంచుకుని లోకేష్ కు సేఫ్ ప్లేస్ అయిన కుప్పం అప్పచెప్పేందుకు దాదాపు ఫిక్స్ అయిపోయాడు.

ఇదే సరైన నిర్ణయం అని టీడీపీ సీనియర్లు కూడా బాబు కి చెబితూ వస్తుండడంతో పాటు ఈ మధ్య నిర్వహించిన సర్వేలు కూడా ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురే లేదు అని తేల్చేయడంతో బాబు ఈ నిర్ణయానికి వచ్చాడు.అయితే ఒక వేళ ఏదైనా అనుకోని కారణంతో అక్కడ లోకేష్ ని పోటీ చేయంచడం కుదరకపోతే ఆ తరువాత అనుకూలమైన ప్రాంతం ఏది అని తెలుసుకునే ప్రయత్నంలో బాబు ఉన్నాడు.కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు.రాజధాని ప్రాంతంలో అభివృద్ధి బాగా సాగుతోంది.భూముల విలువ పెరిగింది.వ్యాపారాలు విస్తరించాయి.

ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.హైదరాబాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు స్థిరపడుతున్నారు.

అందుకే ఈ రెండు జిల్లాలను కూడా పరిగణలోకి తీసుకుని ఏదో ఒక కంచుకోట లో తన వారసుడిని రఁగంలోకి దించేందు బాబు చూస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube