ఏకంగా చిరంజీవి టైటిల్‌పైనే కన్నేశాడే... ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?

మెగాస్టార్‌ చిరంజీవి సినిమా టైటిల్స్‌ను వాడాలి అన్నా, ఆయన పాటలు రీమిక్స్‌ చేయాలనా లేదంటే ఆయన సినిమాలోని ఏదైనా సీన్‌ను రీ మేక్‌ చేయాలన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులే భయపడుతూ ఉంటారు.అలాంటిది నాని చిరంజీవి సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ను వాడేందుకు సిద్దం అయ్యాడు.

 Megastar Title Gang Leader For Natural Star Nani-TeluguStop.com

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సూపర్‌ హిట్‌ మూవీ టైటిల్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’ను నాని మూవీకి రిజిస్ట్రర్‌ చేయించాలని విక్రమ్‌ కుమార్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం టైటిల్‌ను ఒక చిన్న చిత్ర కోసం ఎవరో రిజిస్ట్రర్‌ చేసి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఆ టైటిల్‌ను అతడి నుండి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న విక్రమ్‌, నాని మూవీకి గ్యాంగ్‌ లీడర్‌ అనే టైటిల్‌ పెడితే మాత్రం సంచలనమే అంటున్నారు.

గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌తో విపరీతమైన క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది.అలా భారీ క్రేజ్‌ సినిమాకు వస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా భారీ ఎత్తున ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయం.

గ్యాంగ్‌ లీడర్‌ అనే టైటిల్‌ చాలా వెయిట్‌ ఉండే టైటిల్‌.అంటే ఆ టైటిల్‌తో సినిమాను చేస్తే ఖచ్చితంగా సక్సెస్‌ అవ్వాలి.ఒకవేళ సక్సెస్‌ కాకుండా సినిమాను చేస్తే మాత్రం ఫలితం తారు మారు అయ్యే ప్రమాదం ఉంది.అంటే గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌తో నాని చేయబోతున్న సినిమా హిట్‌ అయితే పర్వాలేదు కాని, ఫ్లాప్‌ అయితే మాత్రం నాని కెరీర్‌పైనే దెబ్బ పడే అవకాశం ఉంది.

గ్యాంగ్‌ లీడర్‌ వంటి పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను పాడు చేశారు అంటూ మెగా ఫ్యాన్స్‌ నానిని టార్గెట్‌ చేసే అవకాశం ఉంది.ఆ విషయం నానికి కూడా తెలుసు, అంతా తెలిసి నాని ఆ సాహసం చేస్తాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube