'ఎన్టీఆర్‌'ను తేజ చేసి ఉంటే పరిస్థితి ఏంటీ.. తల్చుకుంటేనే భయం వేస్తోంది కదా

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఎన్టీఆర్‌’ చిత్రం రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం విడుదల అవ్వగా, తాజాగా ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం విడుదల అయ్యింది.

 The Situation Is Threatening When Teja Directed Ntr Biopic-TeluguStop.com

ఈ రెండు చిత్రాలు కూడా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం రాబట్టడంలో విఫలం అవుతున్నాయి.ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్స్‌ చూసి చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు ట్రేడ్‌ వర్గాల వారు కూడా అవాక్కవుతున్నాయి.

మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ కంటే మరీ దారుణంగా సెకండ్‌ పార్ట్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి.

ఇంత పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

క్రిష్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది కనుక సినిమాకు కనీసం ఈ స్థాయిలో అయినా వసూళ్లు నమోదు అయ్యాయి.

ముందుగా తేజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనుకున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల తాను తప్పుకుంటున్నట్లుగా తేజ చెప్పి తప్పుకున్నాడు.తేజ ఎందుకు తప్పుకున్నాడో అందరికి తెల్సిందే.

అప్పటి వరకు అందుబాటులో లేని క్రిష్‌ ఈ చిత్రంకు వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపించడంతో బాలకృష్ణ ఆయనకు పారితోషం ఇచ్చి మరీ తేజను తప్పించాడు.తేజ కూడా లేనిపోని వ్యవహారం ఎందుకులే అనుకున్నాడో ఏమో కాని వెంటనే సినిమా నుండి తప్పుకున్నాడు.

ఒకవేళ ఎన్టీఆర్‌ చిత్రాన్ని తేజ చేసి ఉంటే ఫలితం మొత్తం కంపు కంపు అయ్యేది.క్రిష్‌ ఈ చిత్రాన్ని చేయడం వల్ల అంతో ఇంతో కలెక్షన్స్‌ వస్తున్నాయి కాని తేజ చేసి ఉంటే మాత్రం మొత్తం పోయేది నడంలో ఏమాత్రం సందేహం లేదు.‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లకు కలెక్షన్స్‌ రాకున్నా టాక్‌ మాత్రం బాగా వచ్చింది.అది సక్సెస్‌గా యూనిట్‌ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే తేజ చేస్తే అది కూడా వచ్చేది కాదేమో అంటున్నారు.మొత్తానికి తేజ ఈ చిత్రాన్ని వదిలేసి అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube