పోలీస్‌ అనే పదంకు నిజమైన అర్థం ఇతడే... వ్యక్తిని కాపాడేందుకు 1.5 కిలోమీటర్ల పరుగు

సమాజంలో పోలీసులు అంటే భయం ఉంది.పోలీసులు అంటే రక్షించే వారు అని అర్థం.

 Police Runs 1 5km On Railway Track Carrying Injured Man On Shoulders-TeluguStop.com

కాని జనాలను భయపెట్టే వారు అని అర్థం మారిపోయింది.పోలీసులు ఎక్కడ ఉన్న కూడా సామాన్యులు కాస్త భయంతో ఉంటారు.

ఆ భయం మంచిదే, ఎందుకంటే పోలీసులు ఉన్నారు అంటే నేరం చేసేందుకు భయపడతారు.అయితే పోలీసులు ఎప్పుడు కూడా సీరియస్‌గా ఉంటూ సాదారణ పౌరుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా ఉండాలి.

అలా వ్యవహరించినప్పుడు పోలీసులపై భయం మాత్రమే కాకుండా గౌరవం కూడా ఉంటుంది.

తాజాగా మద్యప్రదేశ్‌కు చెందిన పోలీస్‌ పూనమ్‌ బిల్లోరే పోలీస్‌ అంటే నిజమైన అర్థం అన్నట్లుగా నిలిచాడు.

పూనమ్‌ బిల్లోరే డ్యూటీ పనిమీద ఒక చోట ఉన్నాడు.ఆ ప్రాంతంలో రన్నింగ్‌ ట్రైన్‌ నుండి ఒక వ్యక్తి జారి పడ్డాడు.విషయం తెలుసుకున్న పూనమ్‌ బిల్లోరే క్షణాల్లో అక్కడకు చేరుకున్నాడు.అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే అతడిని హాస్పిటల్‌లో జాయిన్‌ చేయాలి.

అయితే అతడు జారి పడ్డ ప్రాంతంలో ఎక్కడ కూడా కనీస రోడ్డు వసతి లేదు.వెయికిల్స్‌ వచ్చే పరిస్థితి లేదు.దాంతో ఆ గాయపడిన వ్యక్తిని రక్షించడమే లక్ష్యంగా పూనమ్‌ బిల్లోరే అతడిని బుజాలపై ఎత్తుకుని పరుగు పెట్టాడు.రైల్వే ట్రాక్‌ పై దాదాపు కిలోమీటరున్నర పరుగు పెట్టి అక్కడ ఉన్న పోలీసు వెయికిల్‌ను చేరుకున్నాడు.

వెయికిల్‌లో గాయపడ్డ వ్యక్తిని ఎక్కించి హాస్పిటల్‌కు తరలించాడు.హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నాడు.

పూనమ్‌ బిల్లోరే గాయపడ్డ వ్యక్తిని ఎత్తుకుని ట్రాక్‌ పై పరుగెత్తుకుంటూ వెళ్లడంను కొందరు వీడియో తీశారు.ఇప్పుడు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.ఈ పోలీస్‌ ను నిజమైన హీరో అని, నిజమైన రక్షకుడు అంటూ అభినందనలు తెలుపుతున్నారు.ప్రతి ఒక్క పోలీస్‌ కూడా విధి నిర్వాహణలో ఇంత నిబద్దతతో ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube