ఇది ఓ ప్రేమికుడు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్..! బ్రేకప్ చెప్పిందని.. గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి...!

అంకిత్…సైమా…ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు.సడన్ గా సైమా అంకిత్ కి బ్రేక్ అప్ చెప్పింది.

 A Failure Lover Facebook Post-TeluguStop.com

అంకిత్ ఎంతో బ్రతిమాలాడు.అయినా సైమా వినలేదు.

సైమా సడన్ గా ఎందుకు అలా చెప్పిందో అంకిత్ కి అర్ధం అవ్వలేదు.ఇలా రెండు నెలలు గడిచిన తర్వాత అంకిత్ కి అసలు నిజం తెలిసింది.

సైమాకి మరో అబ్బాయితో పెళ్లి కుదిరిందని.అందుకే తనకు బ్రేకప్ చెప్పిందని తెలుసుకున్నాడు.తనని కాదని.వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ పై ప్రియుడు పెళ్లి మండపంలోనే పగ తీర్చుకున్నాడు.

అందరిలాగానే అంకిత్ కూడా సైమా పెళ్ళికి వెళ్ళాడు.వింధు భోజనం చేశాడు.

తర్వాత వధూవరులతో సెల్ఫీ కూడా దిగాడు.

అంకిత్ ని చూసి సైమా కంగారుపడింది.పెళ్లి ఆపుతాడేమోనని టెన్షన్ పడింది.సెల్ఫీ దిగేసరికి కంగారేమి లేదని కూల్ అయ్యింది.

అప్పుడే అంకిత్ తన ప్లాన్ వర్కౌట్ చేసాడు.గతంలో సైమాతో తనతో చేసిన మేసేజ్ లు, వాళ్లిద్దరూ దిగిన ఫోటోలు ప్రింట్లు తీయించి.

పెళ్లికి వచ్చిన బంధువులందరికీ పంచిపెట్టాడు.తర్వాత సైలెంట్ గా పెళ్లి మండపం నుండి వచ్చేసాడు.

చివరికి పెళ్లి ఆగిపోయిందో లేదో అతనికి తెలీదు.తర్వాత ఎప్పుడూ సైమాని కలవలేదని ఇది నా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

అది కాస్త వైరల్ గా మారింది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube