నెల్లూరులో కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకున్న వైసీపీ!

ఎన్నికల ముందు కాంగ్రెస్ మరో సారి ఏపీలో ఎలా అయిన తిరిగి పుంజుకోవాలని ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిన్న తిరుపతి వేదికగా ప్రత్యెక హోదా భరోసా యాత్ర అంటూ బస్సు యాత్రని మొదలెట్టారు.

 Congress Face Agitation From Ysp In Nellore-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ బహిరంగ సభతో మొదలెట్టాడు.ఇదిలా వుంటే తాజాగా ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాకి ఏపీ కాంగ్రెస్ నేతలు వచ్చారు.

అయితే ఊహించని విధంగా నెల్లూరులో వెంకటగిరి వద్ద కాంగ్రెస్ బస్సు యాత్రకి వైసీపీ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది.

వెంకటగిరి సమీపానికి కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర రాగానే వారిని వసీపీ నేతలు అడ్డుకున్నారు.

ఏపీని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్ర చేసే హక్కు లేదని అడ్డుకున్నారు.దీంతో ఒక్కసారి అక్కడ కాంగ్రెస్, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది.

దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలని అదుపు చేసే ప్రయత్నం చేసారు.అయితే ఈ గొడవకి వైసీపీ నేతలే కారణం అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ వుండగా, కాంగ్రెస్ పార్టీ వైసీపీ మీద రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కారణంగానే అడ్డుకున్నామని అంటున్నారు.

మరి వీటిలో వాస్తవం ఎంత అనేది వారికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube