సక్సెస్‌ స్టోరీ : అంధులకు, వృద్దుల కోసం ఈజీ టాయిలెట్‌.. పీఎం ప్రశంసలు దక్కించుకున్న యువకుడు

మనసుంటే మార్గం ఉంటుంది.ఏదైనా మనసు పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని, ఆ ఫలితానికి తగిన గుర్తింపు దక్కుతుందని సత్యజిత్‌ మిట్టల్‌ నిరూపించాడు.

 Success Story The Young Engineer Finds New Toilets For Senior Citizens-TeluguStop.com

పుణె ఎమ్‌ఐటీ స్టూడెంట్‌ అయిన సత్యజిత్‌ వినూత్నమైన టాయిలెట్‌ బేషన్‌ను తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు.ఇప్పటికే ఉన్న టాయిలెట్‌ బేషన్స్‌ కొందరికి ఇబ్బంది కరంగా ఉంటున్నాయి.

ముఖ్యంగా ముసలి వారికి మరియు అంధులకు టాయిలెట్‌ బేషన్స్‌ కష్టంగా ఉన్న నేపథ్యంలో సత్యజిత్‌ వినూత్నమైన ప్రయోగం చేశాడు.

ఒక్క ప్రయోగంతో ఇద్దరికి ఉపయోగదాయకంగా ఉండేలా ఆయన ప్లాన్‌ చేశాడు.కాళ్ల నొప్పులు ఉన్న వృద్దులు సాదారణ బేషన్‌ పై కూర్కోవడానికి చాలా ఇబ్బంది పడతారు.అందుకే వారి కోసం అని మడమల కింద కాస్త ఎత్తుగా ఉండటంతో పాటు, ఏటవాలుగా ఉండేలా బేషన్‌ను డిజైన్‌ చేయడం జరిగింది.

ఇది కేవలం వృద్దులకు మాత్రమే కాకుండా అందరికి కూడా ఉపయోగదాయకం అంటూ సత్యజిత్‌ చెబుతున్నాడు.మోకాళ్ల నొప్పులు రాకుండా, మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది మంచిదని చెబుతున్నాడు.

వైధ్యులు కూడా దీన్ని దృవీకరిస్తున్నారు.

ఇక అంధులకు గుర్తుంచే విధంగా ముందు భాగంగా కాస్త గరుకులుగా ఉండే మెటల్‌ను వాడాడు.దాంతో వారు ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది.అందుల కోసం మరియు వృద్దుల కోసం సత్యజిత్‌ తయారు చేసిన ఈ కొత్త టాయిలెట్‌ బేషిన్‌కు విదేశాల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ బేషిన్‌కు పేటెంట్‌ హక్కును తీసుకునేందుకు సత్యజిత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇలాంటి విభిన్నమైన ఎన్నో ప్రయోగాలను ఆయన చేసేందుకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.పలు అవార్డులు అందుకున్న సత్యజిత్‌ సక్సెస్‌ స్టోరీ అందరికి ఆదర్శం.సత్యజిత్‌ గురించి నలుగురికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube