పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో బిసిసిఐదే నిర్ణయం! విరాట్ కోహ్లి!

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ తో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న ఇండియా మరో వైపు ఆ దేశం నుంచి వచ్చి కాశ్మీర్ లో తల దాచుకున్న టెర్రరిస్ట్ లని కూడా హతం చేసే ప్రయత్నం మొదలెట్టింది.ఇదిలా త్వరలో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ కప్ క్రికెట్ జరగనుంది.

 Virat Kohli Told On Cricket Match With Pakisthan Based On Bcci Decision-TeluguStop.com

ఇందులో ఏప్రిల్ 16న ఇండియా- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ వుంది.అయితే ఇప్పుడు పుల్వామా ఎటాక్ తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో భారత ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకుండా వుండటం బెటర్ అనే అభిప్రాయంతో వున్నా టీం ఇండియా ఇప్పటికే ఐసిసి ముందు పాకిస్తాన్ ని క్రికెట్ వరల్డ్ కుప నుంచి బ్యాన్ చేయాలని విన్నపాన్ని ఉంచింది.

అయితే ఈ విషయంలో ఐసిసి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వరల్డ్ కప్ టోర్నమెంట్ కి ఇంకా సమయం వుండటంతో పాకిస్తాన్, భారత్ మధ్య వున్న క్రికెట్ సంబంధాలు తెగిపోకుండా సంప్రదింపులు జరపాలని చూస్తుంది.ఇదిలా వుంటే మరో వైపు బీసిసిఐ కూడా ఇంకా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే ఈ విషయంపై టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మీడియా సంప్రదించగా, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే విషయంలో తమ సొంత అభిప్రాయం ఏమీ లేదని బీసిసిఐ ఎలా ఆదేశిస్తే అలా మేము చేస్తామని ఇందులో ఫైనల్ అభిప్రాయం బోర్డ్ ముంబెర్స్ తో అనే తేల్చేసాడు.మరి దీనిపై బీసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube