నన్నే ఓడించాలని చూస్తారా ...? పంతం పట్టిన తలసాని !

ఏపీ రాజకీయల్లో ప్రత్యక్షంగానో… పరోక్షంగానో తలదూరుస్తూ… టీడీపీకి నిద్ర లేకుండా చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరింతగా ఫోకస్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణాలో ఆస్తులు ఉన్న ఏపీ టీడీపీ నేతలపై కన్నేసి వారిని నోటీసులతో భయపెట్టే పనిలో పడింది.

 Talasani Srinivas Fires On Chandrababu Naidu-TeluguStop.com

ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్యెల్యేలు, ఎంపీలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచూ ఏపీలో పర్యటిస్తూ….రాజకీయ సమీకరణాలు మార్చే పనిలో పడ్డాడు.

ఏపీ ప్రజలతో తనకు 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశిస్తే ఆ రాష్ట్ర బీసీలను ఏకం చేస్తానంటూ… తలసాని వ్యాఖ్యానిస్తున్నారు.ఏపీలో జనసేన పార్టీ పోటీ చేయడం వలన టీడీపీ పార్టీకి పడే ఓట్లే చీలుతాయంటూ తలసాని చెప్పుకొస్తున్నారు.తలసాని టీడీపీని ఎక్కువుగా టార్గెట్ చేయడం వెనుక కారణాలు అయితే చాల కనిపిస్తున్నాయి.

తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా సనత్ నగర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న కోపం తో ఉన్న శ్రీనివాస యాదవ్ మళ్లీ ఎపికి వెళతానని చెబుతున్నారు.

ఇక మూడో తేదీన నిర్వహించే సభలో టార్గెట్ చంద్రబాబు అనే విధంగా ఆయన వ్యూహం ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో… ఈయన దూకుడు ప్రదర్శిస్తున్నారు.అయితే ఈ విషయంలో టీడీపీ కూడా అలెర్ట్ అయ్యింది.

తలసాని ఏపీ పర్యటనను తమకు అనుకూలంగా మనుచుకోవడంపై వ్యూహాలకు పదునుపెడుతున్నారు.ఏపీలో రాజకీయాల్లో తెలంగాణ నేతల జోక్యం ఏంటని…? వైసీపీ తో కలిసి టీఆర్ఎస్ ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నాయని…ఈ రెండు పార్టీల కారణంగా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్న కొత్త అనుమానాన్ని ప్రజల్లో రేకెత్తించేలా చేయాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube