ఆదర్శం : 6 ఏళ్ల కూతురు మాటతో ఆరు వేల చెట్లకు 50 వేల మొలలు తొలగించాడు

ఆలోచన రావడం, అయ్యో అనిపించడం అందరికి జరుగుతుంది.కాని కొందరు మాత్రమే ఆ ఆలోచనను అమలులో పెడతారు, అయ్యో అనిపించిన సంఘటనను తీసుకుని దాన్ని సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు.

 6years Daughter Inspires Pune Man To Remove 50000 Nails From 6000trees-TeluguStop.com

వందలో ఒక్కరు మాత్రమే అయ్యో అనిపించి దాన్ని సాల్వ్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు.ఆ వందలో ఒక్కడే మాధవ్‌ పాటిల్‌.

తన ఆరు సంవత్సరాల కూతురు చెట్లను చూసి అయ్యో అంటూ బాధ పడింది.కూతురు బాధ పడిందని తాను కూడా చెట్ల కోసం పని చేయాలని భావించాడు.

అలా ఒక రికార్డునే నెలకొల్పాడు.

మనం రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద చెట్లను చూస్తాం, కాని ఆరు సంవత్సరాల హిర్కాని మాత్రం ఆ చెట్టకు ఉన్న మొలలు(మేకులు)ను చూసింది.

చెట్లకు ప్రాణం ఉందని స్కూల్‌లో చెప్పిన పాఠం విన్న హిర్కాని చెట్లకు మెలలు కొడితో అవి బాధ పడతాయి కదా, మనలాగే అవి ప్రాణం కలిగినప్పుడు వాటికి మేకులు కొడితే చనిపోతాయి కదా నాన్న అంటూ తండ్రి మాధవన్‌ ను ప్రశ్నించింది.కూతురు ప్రశ్న మాధవన్‌ మదిలో బలంగా నాటుకుంది.

తన కూతురు ఆలోచన చాలా బాగా నచ్చింది.ఒక చెట్టుకు రెండు మూడు మొలలు అంటే ఏమో కాని పదుల సంఖ్యలో మొలలు కట్టడం వల్ల ఆ చెట్టు చనిపోయే పరిస్థితి వస్తుంది.

అందుకే నాలుగు ఏళ్ల క్రితం మాధవన్‌ తన చుట్టు పక్కల ఉన్న చెట్లకు మొలలు తీయడం మొదలు పెట్టాడు.

మాధవన్‌ ఇప్పటి వరకు ఆరు వేల చెట్లకు దాదాపుగా 50 వేల మేకులు తొలగించాడు.ఈ ఉద్యమంలో ఆయనకు తోడుగా ఎంతో మంది సాయంగా నిలిచారు.ఒక టీంను ఏర్పాటు చేసుకుని ఆయన ఈ పని చేస్తూ వస్తున్నాడు.

ప్రతి ఆదివారం లేదా సెలవు రోజున ఈ టీం అంతా కూడా కలిసి పెద్ద చెట్లకు ఉన్న మేకులను తొలగించే పని పెట్టుకుంటారు.కొన్ని వేల మేకులు కొట్టబడిన చెట్టు వారికి కనిపించాయి.

వాటిని కాపాడేందుకు వాటన్నింటిని తొలగించారు.ఈ 50 వేలు లక్షకు చేరాలని, ఆరు వేల చెట్టు 10 వేలకు పెరగాలని మాధవన్‌ అండ్‌ టీం కోరుకుంటున్నారు.

నిజంగా మాధవన్‌ మరియు ఆయన కూతురు అందరికి ఆదర్శనీయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube