నేడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు! నివాళి అర్పిస్తున్న సినీ ప్రముఖులు!

ప్రముఖ దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ నిన్న అనారోగ్యంతో హాస్పిటల్ లో మరణించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఆయన మరణ వార్త తెలిసిన తర్వాత చిత్ర పరిశ్రమలో ప్రముఖులు అందరూ వరుసగా ఆయన నివాసానికి వెళ్లి కోడి రామకృష్ణ బౌతికకాయంకి నివాళి అర్పిస్తున్నారు.

 Kodi Ramakrishna Funeral Today At Mahaprasthanam-TeluguStop.com

వందకి పైగా చిత్రాలకి దర్శకత్వంలో వహించిన కోడి రామకృష్ణ కెరియర్ లో ఎంతో మంది హీరోలని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.అలాగే అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు తీసిన దర్శకుడుగా కోడి రామకృష్ణకి గుర్తింపు వుంది.

ఇక ఆయన కెరియర్ లో ఫ్లాప్ ల కంటే సూపర్ హిట్స్ ఎక్కువ అని చెప్పాలి.

సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కోడి రామకృష్ణ పరిచయం చేసిన హీరో, హీరోయిన్స్ తో పాటు ఆయనతో అనుబంధం వున్నా నిర్మాతలు, సినీ ప్రముఖులు అందరూ కోడి రామకృష్ణ ఇంటికి చేరుకొని ఆయనకి నివాళి అర్పిస్తూ, ఆయనతో వున్నా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే కోడి రామకృష్ణ బౌతికకాయంకి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.ఫిలిం నగర్ లో మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలుకి సిద్ధం ఆవుతుంది.

ఈ అంత్యక్రియలలో సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశం వుందని తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube