కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత! లోయలో కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత!

పుల్వామా దాడి తర్వాత ఇండియన్ ఆర్మీకి భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్చ ఇచ్చింది.దీంతో ఇండియన్ ఆర్మీ భద్రతా దళాలు కాశ్మీర్ లోయని జల్లెడ పట్టే పని మొదలెట్టాయి.

 Indian Army Started Operation Clean Up In Kashmir For Terrorists-TeluguStop.com

కాశ్మీర్ లోయలో స్థానికులు ఉగ్రవాదులకి ఎక్కువగా ఆశ్రయం కల్పిస్తూ వుంటారు.అలా ఆశ్రయం పొందిన వారే తరువాత దేశంలో టెర్రరిస్ట్ దాడులకి తెగబడుతూ వుంటారు.

ఇలా కాశ్మీర్ లో చొరబడి స్థానికుల ఆశ్రయం పొందుతున్న టెర్రరిస్ట్ లని ఎరివేరే పనిలో ఇప్పుడు భద్రతాదళాలు వేట మొదలెట్టాయి.ఇప్పటికే భద్రతా దళాలు కాశ్మీర్ లోయని తమ స్వాదీనంలోకి తీసుకొని ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, టెర్రరిస్ట్ లు వున్నారనే అనుమానాలు వుంటే వెంటనే అరెస్ట్ చేయడం లేదంటే ఎన్ కౌంటర్ చేసి వారిని హతమార్చడం చేస్తున్నారు.

ఈ టెర్రరిస్ట్ ల వేటలో పాకిస్తాన్ కి మద్దతుగా నిలిచే వేర్పాటు వాద నాయకులలో కొంత మందిని ఇప్పటికే భద్రతా దళాలు అరెస్ట్ చేసాయి.దీంతో వారికి మద్దతుగా నిలిచే వారు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడానికి ప్రయత్నించారు.

అయితే భద్రతా దళాలు ఎక్కువగా మొహరించి ఉద్రిక్తత స్థాయి పెరగకుండా ఎక్కడికక్కడ నియంత్రిస్తూ వెళ్తున్నారు.మరో వైపు ఇప్పటికే కాశ్మీర్ లోయలో చొరబడ్డ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులో ఓ ఐదు మందిని హతమార్చినట్లు తెలుస్తుంది.

ఇక ఈ కూంబింగ్ కాశ్మీర్ లో ఎంత కాలం కొనసాగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube