అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాక్! జైషే మహమ్మద్ స్థావరాలు స్వాధీనం!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఎప్పటినుంచో మూకుమ్మడిగా యుద్ధం చేస్తున్నాయి.అయితే ఉగ్రవాదం ఆసియా ఖండంలో ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

 Pakistan Government Take A Serious Action On Jaishe Mohamed-TeluguStop.com

పాకిస్తాన్ భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎప్పటినుంచో టెర్రరిస్ట్ సంస్థలను ప్రోత్సహిస్తూ ఇండియా పైకి ఉసిగొల్పుతుంది.ఇండియాలో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఇప్పటికే చాలాసార్లు ఉగ్రదాడులకు తెగబడ్డారు.

తాజాగా పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లుపై ఆత్మాహుతి దాడి చేసి 44 మంది జవాన్ల మృతికి జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే.

పుల్వామాలో ముగ్గురు దాడి తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్ కు అండగా నిలబడ్డాయి.

దీంతో భారత్ పాకిస్థాన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం మొదలెట్టింది.ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలపై చర్యలకు సిద్ధమైంది.

ఇప్పటికే జమాత్-ఉద్-దవా అనే సంస్థపై నిషేధం విధించిన ఆ ప్రభుత్వం తాజాగా జైషే స్థావరాలను స్వాధీనం చేసుకుని అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న 70 మంది అధ్యాపకులను అలాగే ఉగ్రవాద శిక్షణ పొందుతున్న 600 మంది టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు.ఉగ్రవాద స్థావరాలను కూడా పాకిస్తాన్ ఆర్మీ తమ ఆధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube