ఇలా అయితే కష్టమే ! నాయకులను హెచ్చరిస్తున్న బాబు

ఏపీ అధికార పార్టీ టీడీపీ పైకి గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా… లోలోపల తీవ్రంగా ఆందోళన చెందుతోంది.పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని… గెలుపు నల్లేరు మీద నడక అయితే కాదని ఇంటలిజెన్స్ హెచ్చరికలు… అనేక సర్వేలు స్పష్టంగా తేల్చి చెప్పెయ్యడంతో… బాబు లో ఆందోళన తీవ్రంగా కనిపిస్తోంది.

 Chandrababu Naidu Party Meeting About Election Campaigning-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులకు కీలక సూచనలు ఇస్తూ… అప్రమత్తం చేసే పనిలో పడ్డాడు.పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు.

ఇంటెలిజెన్స్ నివేదికలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి.రానున్న రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి.

ముఖ్యంగా ఎలాంటి రాద్ధాంతాలకు తావివ్వకుండా అన్ని కులాల వారితో, మతాల వారికి దగ్గరవ్వాలి.కిందిస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకులు వరకు ఈ విధానాన్ని పాటించాలి” అంటూ… దిశా నిర్దేశం చేస్తూ… అప్రమత్తం చేసే పనిలో పడ్డాడు.

అలాగే… పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలతో పాటు కొందరు నాయకుల నోటి దురుసు కారణంగా పార్టీ అప్రతిష్ట పాలవుతోందని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం .పార్టీ సీనియర్ నాయకులు అందరూ తమకు తామే పెద్దలమంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది పార్టీకి చేటు చేస్తుందని చంద్రబాబు హెచ్చరించినట్లు కొంతమంది టీడీపీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఎన్నికల ముందు కులాలు, మతాల గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మానుకోవాలని హితబోధ చేశారట.మరీ ముఖ్యంగా… ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా దళిత వర్గాలపై చేసిన వ్యాఖ్యలను పార్టీ కొంతవరకు సమర్థిస్తుందని, దాన్ని ఆసరా చేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని ఇకపై ఎవరూ ఆ విధంగా మాట్లాడడానికి వీల్లేదని హెచ్చరికలు జారీ చేశారు.

మరీ ముఖ్యంగా… రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో గ్రూపు తగాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయని, తాను ముందుగా టిక్కెట్లు ప్రకటించడానికి కారణం నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పినట్లు సమాచారం.పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో.అందరు ఐక్యంగా ఉంటే విజయం సాధిస్తాం అని సూచించినట్లు చెబుతున్నారు.ఏదైనా ఒక విషయం మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కేవలం ఒకరిద్దరు నాయకులు మాత్రమే స్పందిస్తున్నారని… ఇది సరికాదని రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి బూత్ లెవల్ నాయకుల వరకు అంతా స్పంచించాలని బాబు దిశా నిర్దేశం చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube