జీవితంలో ఓడి గెలిచిన ఒక మగువ కథ...అందరికి స్ఫూర్తి..! రియల్ స్టోరీ!!!

ఒంటరి మహిళంటే అందరికి చిన్నచూపే.ఇద్దరు బిడ్డలను సాకడానికి చేసే ప్రయత్నంలో ,పడే కష్టాలలో సాయపడేవారుండరు కానీ దెప్పిపొడిచేవారు.

 Hyderabad Women Auto Driver Vijayalakshmi Inspiring Story-TeluguStop.com

సూటి పోటి మాటలనేవారు.వెనకాల రకరకాలుగా మాట్లాడుకునేవారు కోకొల్లలు.

అలాంటి పరిస్తితులన్ని దాటుకుని వచ్చి ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ.ప్రస్తుతం తనకంటూ ఒక గుర్తింపు పొందిన మహిళే విజయలక్ష్మీ…విశ్వనగరం హైదరాబాద్ లో ఉన్నది ముగ్గురు నలుగురు మహిళా డ్రైవర్లు మాత్రమే.

వారిలో ఈమె ఒకరు.కష్టాలు ,కన్నీళ్లు.

అమ్మనాన్నలకు ఆరుగురు సంతానంలో విజయలక్ష్మీ ఒకరు.మేనమామ మధుతో వైభవంగా పెళ్ళిచేశారు.ఎటువంటి ఆర్దిక ఇబ్బందులు లేవు.ఉన్నంతలో సంతోషంగా బతుకుతుంటే.

దగ్గరి వాళ్లే మోసం చేయడంతో కట్టుబట్టలతో ఊరొదిలి హైదరాబాద్ వచ్చేశారు.అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది .చంకలో పిల్లాడిని ఎత్తుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటు గడుపుతుంటే,భర్తకు డ్రైవింగ్ వచ్చు ఆటో నడిపిస్తే ఇప్పుడున్న పరిస్థితుల నుండి భయటపడొచ్చు అని అద్దేకు తీసుకుని ఆటో నడపడం మొదలుపెట్టారు.కాని కొన్నాళ్ళకే భర్త అనారోగ్యానికి గురయ్యారు.

ఆటో నడిపితే ఎంతోకొంత ఆదాయంతో రోజులు గడిచేవి పరిస్థితి మరింత దిగజారిపోయింది.రోజు గడవడం కష్టంగా ఉందంటే, భర్తను కాపాడుకోవడం మరింత కష్టంగా మారింది.

ఏదైనా ఉద్యోగం చేద్దామంటే అక్షరం ముక్కరాదు .ఎటూ దిక్కు తోచని పరిస్థితులలో తనే ఆటో నేర్చుకుంటే అనే ఆలోచన వచ్చిందే తడవుగా.“భర్త ప్రోత్సాహంతో కేవలం 15రోజులలోనే ఆటో నడపడం నేర్చుకుంది….ఆటో నడపడం నేర్చుకోవడం, లైసెన్స్ తీసుకోవడం వరకైతే బాగుంది.

అసలు కథ ఇప్పుడే మొదలైంది.
మహిళ కదా జాగ్రత్తగా తీసుకువెళ్తుందా లేదా అని ఆటో ఎక్కడానికి చాలామంది భయపడేవారు, అంతేకాదు తక్కువ ధరకు బేరాలాడేవారు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోయినా గాని ఎంతోకొంత వస్తుంది అనే ఆశతో ఆటో నడిపేవారు.ఆకతాయుల నుండి ఇబ్బందులు ఎదురుకోనెవారు.కావాలని ఆటో ఎక్కి అసభ్యంగా మాట్లాడేవారు కొందరు, ఇంకోసారైతే ఏకంగా ఒక వ్యక్తి “నీకు డబ్బులిచ్చేది లేదు” నీ ఇష్టమచ్చింది చేస్కో అని మాట్లాడేవారు ఇంకొందరు.

అలాంటి సంధర్బం ఒకసారి ఎదురైతే బెదరకుండా “రెండు చెంపలు వాయించి” మరి డబ్బులు వసూలు చేసుకున్నారట.“కొడుకును పోలీస్ గా, కూతురిని ఇంజినీర్” గా చూడడమే తన లక్ష్యం అని తన జీవితంలో ముందుకు సాగిపోతున్నారు… చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకునేవారికి విజయలక్ష్మీగారు ఒక స్పూర్తి .హ్యాట్సాప్ అండీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube