ఓటాన్ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేసిన కేసీఆర్!

తెలంగాణ ఎన్నికల తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశ పెడుతున్నారు.ఈ బడ్జెట్ లో భాగంగా తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వారీగా బడ్జెట్ ని కేటాయిస్తూ కేసీఆర్ తన ప్రసంగం చేసారు.

 Ts Budget Allocates Most To Welfare Schemes-TeluguStop.com

ఇందులో ముఖ్యంగా లక్ష 82 వేల 17 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ అందులో మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ కి 22వేల 500 కోట్లు కేటాయించారు.అలాగే మైనార్టీ సంక్షేమానికి 2 వేల కోట్లు, ఆసరా ఫించన్లకి 12వేల కోట్లు, గత సంవత్సరం డిసెంబర్ 11 లోపు లక్ష లోపు వున్న రైతుల రుణాలని మాఫీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

వ్యవసాయ శాఖకి 27 వేల కోట్లు, నిరుద్యోగ బృతికి 1810 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి 9827 కోట్లు, రైతు బంధుకి 1200 కోట్లు, రైతు రుణమాఫీకి 6 వేల కోట్లు, పీడీఎస్ బియ్యం సబ్సిడీకి 2744 కోట్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం 1450 కోట్లు, ఎస్సీల సంక్షేమం కోసం 16581 కోట్లుని కేటాయించారు.మొత్తానికి ఎక్కువగా ఈ ఓటాన్ బడ్జెట్ లో మెజారిటీ కేటాయింపులని కేసీఆర్ సంక్షేమ పథకాల కోసం, అలాగే వ్యవసాయం, రైతులు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసమే కేటాయించి నట్లు తెలుస్తుంది.

మరి ఈ ఓటాన్ బడ్జెట్ పై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube